ర్యాంకింగ్స్ లో సత్తా చాటిన సిరాజ్

ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్, తెలంగాణ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు.

Update: 2025-08-07 11:15 GMT

ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్, తెలంగాణ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్ అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 23 వికెట్లతో సత్తా చాటాడు సిరాజ్. జస్‌ప్రీత్ బుమ్రా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జడేజా మూడు స్థానాలు దిగజారి 17వ స్థానానికి పడిపోయాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్ మూడు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. గాయంతో ఆఖరి టెస్ట్‌కు దూరమైన రిషభ్ పంత్ ఒక స్థానం దిగజారి 8వ స్థానంలో నిలిచాడు. శుభ్‌మన్ గిల్ 4 స్థానాలు దిగజారి 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్ట్ ఆల్‌ రౌండర్స్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

Tags:    

Similar News