Shubaman Gill : చివరి టీ20కి శుభ్‌మన్ గిల్‌కు దూరం.. కారణం మాత్రం?
ఫామ్‌లో లేని భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ను జట్టు నుంచి తప్పించారు
ఫామ్‌లో లేని భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ను జట్టు నుంచి తప్పించారు. గిల్ కు గాయం తగిలింది. దీంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో గిల్ కాలి వేళ్లకు గాయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. లక్నోలో మ్యాచ్ కు గిల్ ను దూరం పెట్టాలని నిర్ణయించింది. అయితే ఆ మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా జరగలేదు. చివరి టీ20 మ్యాచ్ భారత్ - దక్షిణాఫ్రికామధ్య అహ్మదాబాద్ లో చివరి టీ 20 మ్యాచ్ కూడా గిల్ ఆడే అవకాశాలు లేవని తెలిసింది.
నెట్స్‌లో గాయం...
నాలుగో టీ20కు ముందు రోజు నెట్స్‌లో గిల్ బ్యాటింగ్ సెషన్ చేశాడు. ఆ సమయంలో బంతి కాలి వేళ్లకు తగిలింది. వెంటనే నొప్పి మొదలై నడవడంలో ఇబ్బంది ఎదురైంది. నిన్న మ్యాచ్ జరిగి ఉంటే ఆడటం కష్టమని వైద్యులు అంచనా వేశారు. అందుకే లక్నో మ్యాచ్‌లో ఆడటం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.“అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌కు గిల్ ఆడతాడా లేదా ఇప్పుడే చెప్పడం కష్టమని భావిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు చివరి సిరీస్‌గా న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20లు ఉండటంతో, ఎంపిక కమిటీతో పాటు జట్టు యాజమాన్యం గిల్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
ఫామ్ లో లేకపోవడంతో...
మరొకవైపు శుభమన్ గిల్ ఇటీవల ఫామ్ లో లేకపోవడం కూడా జట్టు నుంచి తప్పించడానికి కారణంగా చెబుతున్నారు. టాప్ ఆర్డర్ కీలక బ్యాట్స్‌మన్ కావడంతో రిస్క్ తీసుకోకూడదని భావించి అతని స్థానంలో సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకునే అవకాశముంది. టీ20 సిరీస్‌కు ముందు గిల్‌ను ఫిట్‌గా ప్రకటించినప్పటికీ, సంజూ శాంసన్ వరుస సిరీస్‌లో మూడు సెంచరీలు చేసిన నేపథ్యంలో గిల్ ఎంపికపై విమర్శలు వినిపించాయి. ప్రస్తుత సిరీస్‌లో గిల్ స్కోర్లు కూడా నిరాశపరిచాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో 4, 0 రన్స్ మాత్రమే చేశాడు. ధర్మశాలలో జరిగిన మూడో మ్యాచ్‌లో 28 రన్స్ చేసినా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోవడంతో గిల్ ను ఈ చివరి మ్యాచ్ కు తప్పించారన్నది అసలు నిజం.