India vs South Africa : ఈరోజు మన బ్యాటర్లు ఏం చేస్తారో?

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్ పై అంచనాలు భారత అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Update: 2025-11-24 02:24 GMT

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్ పై అంచనాలు భారత అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వరసగా రెండు రోజులు దక్షిణాఫ్రికా ఆధిపత్యమే కనిపించింది. రెండు రోజులు భారత బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారనే చెప్పాలి. వికెట్లు తీయడానికి చాలా అవస్థలు పడ్డారు. దీంతో దక్షిణాఫ్రికా ఒకరకంగా భారత్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. టీం ఇండియా బ్యాటింగ్ బలాన్ని చూసిన వారికి ఎవరికైనా కలవరం మొదలవుతుంది. అందుకే రెండో టెస్ట్ పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నాలుగు వికెట్లు తీయడానికి...
తొలి ఇన్నింగ్స్ లో తొలిరోజు దక్షిణాఫ్రికా 247 పరుగులు చేసింది. ఆరు వికెట్లను తీసింది. రెండో రోజు మిగిలిన నాలుగు వికెట్లు తీయడానికి ఇండియా బౌలర్లు తెగ తంటాలు పడ్డారు. చివరకు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 489 పరుగులు చేయగలిగింది. అప్పటికి గాని దక్షిణాఫ్రికా ఆల్ అవుట్ కాలేదు. ఇక దక్షిణాఫ్రికా బ్యాటర్ ముత్తుస్వామి సెంచరీ చేశాడు. 109 పరుగులు చేయగలిగాడంటే మన బౌలర్ల సామర్థ్యం ఏంటో కనిపించింది. తొమ్మిదో స్థానంలో వచ్చిన మార్కో యాన్సెస్ కూడా 93 పరుగులు చేశాడు.
బౌలర్లు కష్టపడినా...
తొలిరోజు ఎవరూ హాఫ్ సెంచరీ చేయలేకపోయినా 247 పరుగులు చేసి ఆరు వికెట్లు తీయగలిగన మనోళ్లు రెండో రోజు 242 పరుగులు జోడించేంత వరకూ నాలుగు వికెట్లు తీయలేకపోయారు. భారత్ బౌలర్లలో కులదీప్ యాదవ్ నాలుగు, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, సిరాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగలిగారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా ఆరు ఓవర్లు ఆడి కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్లు, పేసర్లను తట్టుకుని మనోళ్లు ఎలా నిలబడతారన్ని చూడాల్సి ఉంది. హోప్స్ భారత్ కు తక్కువగానే కనిపిస్తున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. క్రికెట్ కదా.. ఏదైనా జరగొచ్చు.
Tags:    

Similar News