నేడు గెలవకపోతే సిరీస్ పోయినట్లే
భారత్ - న్యూజిలాండ్ మధ్య రెండో టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. ఈరోజు జరగనున్న మ్యాచ్ ఇండియాకు కీలకంగా మారింది.
భారత్ - న్యూజిలాండ్ మధ్య రెండో టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. ఈరోజు జరగనున్న మ్యాచ్ ఇండియాకు కీలకంగా మారింది. లక్నోలో రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ పై కసి తీర్చుకునేందుకు న్యూజిలాండ్ టీ 20 సిరీస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తుంది. తొలి టీ 20 లో 21 పరుగుల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్ రెండో టీ20ని గెలిచి సిరీస్ ను ముందే దక్కించుకోవాలనుకుంటుంది.
డెత్ ఓవర్లలో...
భారత్ ఈ మ్యాచ్ లో శ్రమించాల్సి ఉంది. బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణిస్తేనే విజయం సాధ్యమవుతుంది. లక్నో స్టేడియం బ్యాటింగ్, బౌలింగ్ కు సమానంగా సహకరిస్తుంది. అందుకే ఇద్దరూ రాణించాల్సి ఉంటుంది. భారత్ యువ ఆటగాళ్లు భవిష్యత్ లో టీం ఇండియాలో చోటు దక్కించుకోవాలనుకుంటే శ్రమించి ఆడాల్సిందే. అర్షదీప్ నో బాల్స్ వేయకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వకుండా న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేయాల్సి ఉంటుంది.