India vs South Africa : నేడు భారత్ - దక్షిణాఫ్రికా రెండో టీ20
నేడు భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రెండో టీ20 మ్యాచ్ ముల్తాన్ పూర్ లో జరగనుంది.
నేడు భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ముల్తాన్ పూర్ వేదికగా ఈరోజు రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కటక్ లో జరిగిన తొలి మ్యాచ్ లో గెలిచిన ఊపు మీద భారత్ ఉంది. రెండో మ్యాచ్ లోనైనా గెలవాలని కసితో దక్షిణాఫ్రికా ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు పెద్దగా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనున్నాయని తెలిసింది.
ముల్తాన్ పూర్ లో జరగనున్న...
మొత్తం ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇప్పటికే భారత్ 1-0 ఆధిక్యతతో ఉంది. అందుకోసమే ముల్తాన్ పూర్ లో జరిగే మ్యాచ్ గెలవాలని దక్షిణాఫ్రికా శక్తిమేరకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో వరస విజయాలతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించాలని భారత్ తహతహలాడుతుంది. ముల్తాన్ పూర్ లో భారత్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశముంది.