నేడు బంగ్లాదేశ్ తో రెండో వన్డే

భారత్ - బంగ్లాదేశ్ రెండో వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తేనే సిరీస్ ను దక్కించుకునే అవకాశాలున్నాయి

Update: 2022-12-07 03:50 GMT

భారత్ - బంగ్లాదేశ్ రెండో వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తేనే సిరీస్ ను దక్కించుకునే అవకాశాలున్నాయి. లేకుంటే సిరీస్ ఈ మ్యాచ్ తో కోల్పోతుంది. అందుకే ఈ మ్యాచ్ భారత్ కు చావో రేవో అని చెప్పాలి. తొలి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగినా భారత్ చేజేతులా మ్యాచ్ ను కోల్పోవడం భారత్ క్రికెట్ అభిమానులను నిరాశలోకి నెట్టింది. బ్యాటర్లు విఫలమయ్యారు. బౌలింగ్ పరవాలేదనిపించినా క్యాచ్ లు జారవిడచడంతో చేతికి వచ్చిన మ్యాచ్ చేజారిపోయింది.

ఎలాగైనా విజయం సాధించాలని...
బంగ్లాదేశ్ పై ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని టీం ఇండియా భావిస్తుంది. 2015లో చివరిసారిగా బంగ్లాదేశ్ లోవన్డే సిరీస్ ను భారత్ కోల్పోయింది. ఆ సిరీస్ లో కూడా మూడో వన్డేలోనే భారత్ విజయం సాధించింది. మరి ఇప్పుడు అదే పరిస్థిితి రాకుండా మూడో మ్యాచ్ సిరీస్ ఎవరి పరం అవుతుందన్న ఉత్కంఠను మిగిల్చేలా ఈ మ్యాచ్ ను గెలవాల్సి ఉంది. ఒకవేళ తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ భారత్ చేయగలిగితేనే బంగ్లాదేశ్ ను కట్టడి చేయగలదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News