Ind vs Eng Second Test : ఫస్ట్ డే మనదే కానీ.. భారీ స్కోరు చేస్తేనే?

భారత్ - ఇంగ్లండ్ రెండో టెస్ట్ కూడా మళ్లీ ఊరిస్తుంది. తొలి రోజు మనోళ్లు బాగానే ఆడటంతో మంచి స్కోరు లభించింది.

Update: 2025-07-03 01:56 GMT

భారత్ - ఇంగ్లండ్ రెండో టెస్ట్ కూడా మళ్లీ ఊరిస్తుంది. తొలి రోజు మనోళ్లు బాగానే ఆడటంతో మంచి స్కోరు లభించింది. తొలి టెస్ట్ లోనూ అదే జరిగింది. ఫస్ట్ డే మనవైపు మొగ్గు చూపింది. ముగ్గురు సెంచరీలు చేసినా చివరకు మ్యాచ్ ను చేజార్చుకోవాల్సివచ్చింది. ఇప్పుడు రెండో టెస్ట్ లోనూ మొదటిరోజు మన బ్యాటర్లు బాగానే ఆడటంతో భారత్ భారీ స్కోరు సాధించింది. తొలిరోజు భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. ఇందులోశుభమన్ గిల్ సెంచరీ చేయగా యశస్వి జైశ్వాల్ మరోసారి 87 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

లోయర్ ఆర్డర్ నిలబడితే...
తొలి టెస్ట్ లో తడబడిన లోయర్ ఆర్డర్ ఈ మ్యాచ్ లో తేరుకుని ఆడగలిగితే భారత్ భారీ స్కోరు చేయగలుగుతుంది. కెప్టెన్ శుభమన్ గిల్ 114 పరుగులు చేసి ఇంకా క్రీజులో ఉన్నాడు. యశస్వి జైశ్వాల్ 87 పరుగులు చేసి అవటుడయ్యాడు. గిల్ కు తోడు రవీంద్ర జడేజా ఉండి మంచి ప్రదర్శన చేస్తున్నాడు. జడేజా ఇప్పటి వరకూ 67 బంతులను ఎదుర్కొని 41 పరుగులు చేశాడు. ఇద్దరు కలసి ఆరో వికెట్ కు 99 పరుగులు జోడించింది. ఎడ్జ్ బాస్టన్ పిచ్ కూడా బ్యాటింగ్ పిచ్ కావడంతో భారీ పరుగుుల చేసి ఇంగ్లండ్ ఎదుట భారీ పరుగుల లక్ష్యాన్ని ఉంచాల్సిన అవసరం ఉంది.
మళ్లీ టాస్ ఇంగ్లండ్ దే...
లీడ్స్ మ్యాచ్ లో మాదిరిగానే టాస్ ఇంగ్లండ్ కే దక్కడంతో వారు బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో భారత్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఇక జైశ్వాల్ కరుణ్ నాయర్ ఇద్దరు బాగా ఆడుతున్న సమయంలో వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. వోక్స్ సొంత పిచ్ కావంతో చెలరేగిపోవడం ఖాయమన్న అంచనాలున్నాయి. కరుణ్ నాయర్ 31 పరుగులు చేసి వెనుదిరిగాడు. కె.ఎల్ రాహుల్ రెండు పరుగులకే వెనుదిరగడం కొంత ఆందోళనకరమే అయినప్పటికీ మిగిలిన బ్యాటర్లు నిలదొక్కుకుని ఆడి మంచి స్కోరును ఇంగ్లండ్ ముందు ఉంచితే ఈ మ్యాచ్ ను దొరకబుచ్చుకునే అవకాశాలున్నాయన్నది క్రీడా విశ్లేషకులఅంచనా. మరి ఏం జరుగుతుందననది చూడాలి.


Tags:    

Similar News