IPL 2025 : నేడు ఐపీఎల్ లో డబుల్ ధమాకా

ఐపీఎల్ లో నేడు పంజాబ్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది.ముంబయి ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టనుంది

Update: 2025-04-20 03:07 GMT

ఐపీఎల్ లో మ్యాచ్ లు సగానికి చేరుకునే సరికి జట్లు కుదుట పడ్డాయి. కొన్ని జట్లు తేరుకుని విజయాల వైపు నడుస్తుండగా, మరికొన్ని జట్లు మాత్రం ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఎందుకో తెలియదు కానీ గత సీజన్ లో మెరుపులు మెరిపించిన రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈసారి మాత్రం పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాయి. దీంతో అవి పాయింట్ల పట్టికలో చివరిగా నిలిచాయి. గత సీజన్ లో అన్ని విభాగాల్లో రాణించిన జట్లు ఈసారి మాత్రం మంచి ప్రదర్శన చేయలేకపోతున్నాయి.

నేడు కూడా రెండు మ్యాచ్ లు...
ఈరోజు ఐపీఎల్ లో మరో రెండు కీలక మ్యాచ్ లు జరగనున్నాయి. రివెంజ్ తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఐపీఎల్ లో నేడు పంజాబ్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. న్యూ ఛత్తీస్ ఘడ్ లో ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు జరగనుంది. మరో కీలక మ్యాచ్ ముంబయి ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ముంబయిలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే బెంగళూరు, చెన్నై రెండూ ఈ మ్యాచ్ లో గెలిచి కసి తీర్చుకోవాలని చూస్తున్నాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.


Tags:    

Similar News