IPL 2025 : నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్
ఈరోజు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగాల్సి ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ నేడు జరగనుంది
ఐపీఎల్ 18వ సీజన్ ఎండింగ్ కు వచ్చేసరికి మ్యాచ్ లు రద్దవుతున్నాయి. నిన్న ధర్మశాలలో ఢిల్లీ కాపిటల్స్ తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ రద్దయింది. భద్రతాకారణాల దృష్ట్యా మ్యాచ్ ను రద్దు చేశారు. పాక్ దాడులకు తెగబడుతుండటంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా కొన్ని మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసుకు దగ్గరగా ఉన్న సమయంలో పాక్ - భారత్ ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలతో మ్యాచ్ లు జరుగుతాయా? లేదా? అన్నది సందేహంగా మారింది.
మ్యాచ్ జరిగితే...
అయితే ఈరోజు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగాల్సి ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ నేడు జరగనుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగాల్సి ఉంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మంచి ఫామ్ లో ఉంది. పదకొండు మ్యాచ్ లు ఆడిన బెంగళూరు ఎనిమిది మ్యాచ్ లలో గెలిచి మూడు మ్యాచ్ లలో ఓడింది. పదహారు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరొక వైపు లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం పదకొండు మ్యాచ్ లు ఆడి ఐదింటిలో గెలిచి, ఆరింటిలో ఓడి పది పాయింట్లతో సరిపెట్టుకుంది. దీంతో ఈ మ్యాచ్ జరిగితే ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.