రోహిత్ ప్రేమతో తిడతాడు

జూనియర్‌ ఆటగాళ్లను రోహిత్‌ శర్మ తిట్టడం వెనుక ప్రేమ ఉంటుందని టీమ్‌ఇండియా ఆటగాడు యశస్వి జైస్వాల్‌ అన్నాడు.

Update: 2025-12-11 13:34 GMT

జూనియర్‌ ఆటగాళ్లను రోహిత్‌ శర్మ తిట్టడం వెనుక ప్రేమ ఉంటుందని టీమ్‌ఇండియా ఆటగాడు యశస్వి జైస్వాల్‌ అన్నాడు. రోహిత్‌ ఎప్పుడు తిట్టినా ప్రేమతో తిడతాడని, అందులో చనువు ఉంటుందన్నాడు. రోహిత్ శర్మ ఒకవేళ తిట్టకపోతే ఏదో అసౌకర్యంగా ఉంటుంది. ఏం జరిగి ఉంటుంది? ఎందుకు తిట్టట్లేదు అని అనుకుంటామన్నాడు జైస్వాల్. రోహిత్, కోహ్లి జట్టులో ఉంటే తమకు ప్రేరణగా ఉంటుందని, వాళ్లు జట్టులో ఉండడం మేలు చేస్తుందన్నాడు. ఆట గురించి చర్చిస్తారు. అనుభవాలను మాతో పంచుకుంటారు. ఆ ఇద్దరు తమ కెరీర్‌ మొదట్లో చేసిన తప్పుల గురించి వివరించి, మేము అలాంటి తప్పులు చేయకుండా ఎలా ఉండాలో చెబుతారన్నాడు. రోహిత్-కోహ్లీ జట్టులో లేనప్పుడు వెలితిగా అనిపిస్తుందని, ఆ ఇద్దరు ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందని జైస్వాల్‌ స్పష్టం చేశాడు.

Tags:    

Similar News