IPL 2026 : గుజరాత్ టైటాన్స్ పై రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం
రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ పై గెలిచింది
రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ పై గెలిచింది. అత్యంత ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నే విజయం వరించింది. ఐపీఎల్ లో ఈ సీజన్ లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆరంభం నుంచే దూకుడు చూపింది. యశస్వి జైస్వాల్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించింది. జైశ్వాల్ 36 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ వేగంగా 31 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అతడు 42 బంతుల్లో 75 పరుగులు చేసి వేగంగా ఆడాడు. రియాన్ పరాగ్ 8 పరుగులు చేసి వెనుదిరిగాడు. షిమ్రోన్ హెట్‌మైర్ 8 బంతుల్లో 18 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు.
వేగంగా ఆడి...
వికెట్లు వరుసగా పడినా, చివరి ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ వేగం పెంచింది. రవీంద్ర జడేజా ఏడు పరుగులు చేశాడు. జోఫ్రా ఆర్చర్ నాటౌట్‌గా ఒక పరుగుతో నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్ కీలక వికెట్లు తీశారు. రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా వికెట్లు తీసి జట్టుకు మద్దతుగా నిలిచారు. అయినా రాజస్థాన్ భారీ స్కోరు సాధించేందుకు దోహదపడింది. 211 పరుగుల లక్ష్యాన్ని కోల్ కత్తా నైట్ రైడర్స్ చేధించాల్సి ఉంది. అయితే ఛేదనకు వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆరంభంలో దూకుడుగానే ఆడింది.
గెలుస్తుందనుకుంటే...
పన్నెండు ఓవర్లకు 127 పరుగులు చేసింది. అప్పటికి గుజరాత్ టైటాన్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోవడంతో కోల్ కతా సులువుగా విజయం సాధిస్తుందని అంచనాలు వినిపించాయి. ఓపెనర్ గా వచ్చిన సాయి సుదర్శన్ 73 పరుగులు, కుశాగ్ర 18 పరుగులు చేశారు. బట్లర్ 25 పరుగులు చేశాడు. జడేజా నాలుగు, రాహుల్ తెవాతియా 12, బిష్ణోయ్ 12 పరుగులు, షారుక్ ఖాన్ 11, రషీద్ ఖాన్ 24 పరుగులు చేశాడు. అయితే తిరుగులేని స్థితిలో ఉన్న గుజరాత్ టైటాన్స్ గెలిచే దిశలో దూసుకుపోతున్న దశలో రవి బిష్ణోయ్ వికెట్లు తీయడంతో రెండు ఓవర్లలో పదిహేను పరుగులు చేయాల్సి ఉండగా గుజరాత్ చేయలేకపోయింది. గుజరాత్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమయింది.