IPL 2026 : నేడు ఐపీఎల్ లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్

ఐపీఎల్ లో నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది

Update: 2026-04-06 03:36 GMT

ఐపీఎల్ లో నేడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. కోల్ కతా వేదికగా నేడు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే తన సొంత మైదానంలో కోల్ కతా ఈరోజు అయినా తన సత్తా చాటుతుందా? అన్న సందేహాలు ఆ జట్టు అభిమానుల్లో ఉన్నాయి.

కోల్ కత్తా నైట్ రైడర్స్ తో.. పంజాబ్ కింగ్స్...
పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకూ జరిగిన రెండు మ్యాచ్ లలో గెలుపొందింది. కోల్ కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకూ జరిగిన రెండు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. అన్ని విభాగాల్లో ఇబ్బందులు పడుతున్న కోల్ కతా నైట్ రైడర్స్ నేడు పుంజుకుంటే తప్ప గెలుపు సాధ్యం కాదు. పంజాబ్ కింగ్స్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండటంతో విజయం చివరకు ఎవరిని వరిస్తుందన్నది వేచి చూడాలి.












Tags:    

Similar News