IPL 2026 : నేడు కోల్ కత్తా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు కోల్ కత్తా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే చెరి ఒక మ్యాచ్ లు ఆడిన ఇరుజట్లు ఓటమిని చవిచూశాయి. దీంతో ఈ మ్యాచ్ గెలిచేందుకు ఇరు జట్లు శ్రమిస్తున్నాయి.
ఇరు జట్లు ఓడిపోయి...
రెండు జట్లు బలంగానే ఉన్నాయి. ముంబయి ఇండియన్స్ పై కోల్ కత్తా నైట్ రైడర్స్ ఓటమి పాలు కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. దీంతో ఇరు జట్లు హోరాహోరీ తలపడనున్నాయి. ఇరు జట్లు బౌలింగ్, బ్యాటింగ్ పరంగా బలంగా ఉండటంతో విజయంపై ఉత్కంఠ నెలకొంది.