IPL 2026 : ఐపీఎల్ లో నేడు మరో బిగ్ ఫైట్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబయి ఇండియన్స్ మధ్య పోరు జరగనుంది
ఐపీఎల్ లో నేడు మరో బిగ్ ఫైట్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబయి ఇండియన్స్ మధ్య పోరు జరగనుంది. ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలిచాయి. రెండు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీతో పోల్చుకుంటే ముంబయి ఇండియన్స్ ఒకింత బలంగా కనిపిస్తుంది.
రెండు జట్లు చెరో మ్యాచ్ లో గెలిచి
ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్ మీద విజయం సాధించింది. ముంబయి ఇండియన్స్ కోల్ కత్తా నైట్ రైడర్స్ పై విజయం సాధించింది. భారీ పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించగలిగింది. దీంతో ఈ మ్యాచ్ లో ఎవరిది విజయం అన్నది చివర వరకూ తేలే అవకాశముండదన్న అంచనాలు వినిపిస్తున్నాయి.