Nithish Kumar Reddy : ఏమని పొగడనురా.. నిన్ను ఏమని కీర్తించినురా

బాక్సింగ్ డే టెస్ట్ లో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అరుదైన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి

Update: 2024-12-28 11:48 GMT

బాక్సింగ్ టెస్ట్ లో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అరుదైన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. నితీష్ రెడ్డి సెంచరీతో వాళ్ళ నాన్న ముత్యాల రెడ్డి కళ్ళ నీళ్లు పెట్టుకున్న వేళ. తండ్రి త్యాగాలు ఫలించిన రోజు నిజంగా అవి కన్నీళ్లు... కావు.. ఆనంద భాష్పాలు.. తన కుమారుడు భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన క్షణం ఏ తండ్రి హృదయం మాత్రం ఉప్పొంగదు. ఎంతటి ఉద్వేగమంటే కామెంటరీ బాక్సు లో రవి శాస్త్రి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారంటే నితీష్ రెడ్డి సెంచరీ నిజంగా నేడు ఒక భారత్ కు ఒక మంచి బ్యాట్స్ మెన్ దొరికినట్లే. అదీ ఒక తెలుగు వాడు ఇలా ఆస్ట్రేలియా గడ్డ మీద బ్యాటు ఎత్తి అరిచాడంటే మనందరికీ గర్వకారణమే.

సెంచరీ కోసం...

నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం చూస్తూ ఉండిపోయింది. ఒక్క పరుగు కోసం ప్రత్యర్ధి అభిమానులు కూడా దేవుడికి మొక్కుకున్నారు.లంచ్ వరకు నిలబడితే చాలు అనుకున్న మ్యాచ్ నుఆస్ట్రేలియా నుంచి నితీష్ లాగేసుకున్నాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ కాదు అంతకు మించి... ఈ సెంచరీ పది వరల్డ్ కప్ లతో సమానం అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది. ప్యూర్ టెస్ట్ క్రికెట్... ది బెస్ట్ సెంచరీ... ఇంతకు మించి గొప్ప ఇన్నింగ్స్ ఈ మధ్య కాలంలో చూడలేదంటూ కామెంట్ బాక్సులు నిండిపోయాయి. కమ్మిన్స్ కు మైండ్ పని చేయలేదు. ఎన్ని సార్లు ఫీల్డ్ ప్లేస్ మెంట్స్ మార్చాడో లెక్కేలేదు. ఎక్కడా ఒక్క అవకాశం ఇవ్వకుండాఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ ఒక్క బాల్ కూడా ఆడలేదు నితీష్ కుమార్ రెడ్డి.
కొత్త బాల్ వచ్చినప్పుడు...
కొత్త బాల్ వచ్చినపుడు చేసిన ఆఫ్ సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డి స్టార్క్ బౌలింగ్ లో కవర్స్ లో కొట్టిన ఫోర్ సొగసు చూడతరమా? అన్నట్లుంది. గ్యాప్స్ లో సరదాగా ఏ మాత్రం కంగారు లేకుండా మూడు రెండేసి పరుగులు తీసుకున్నాడు. తన నాచురల్ గేమ్ అసలు ఆడలేదు.. సింగిల్ మిస్టేక్ లేదు... ఏ బాల్ కు టెంప్ట్ అవ్వలేదు. పరుగులు చేసేయాలనే కంగారు లేదు. క్రీజ్ లో నిలబడితే పరుగులు వస్తాయని ఎదురు చూసాడు. కొత్త బాల్ వచ్చినప్పుడు ఎక్కడా ఏ రకంగానూ కంగారు లేదు. కూల్ గా బాల్స్ వదిలేశాడు నితీష్. దాదాపు డెబ్భయి శాతం షార్ట్ పిచ్ బాల్స్ వదిలేసాడు. కనెక్ట్ అవుతుంది అనుకుంటేనే షాట్ ఆడాడు. సుందర్ తో సమన్వయం చాలా బాగుంది. సింగిల్స్ చాలా కూల్ గా తీసుకున్నాడు. సెంచరీ చేసినప్పుడు సుందర్ ఉండుంటే బాగుండేది. ది వెరీ బెస్ట్... వేరి వేరి వేరి స్పెషల్ సెంచరీ... టెస్ట్ క్రికెట్ బోరింగ్ అన్న వాళ్లకు ఈ ఇన్నింగ్స్ చూసి తీరాల్సిందే.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now




Tags:    

Similar News