IPL 2025 : నేడు చెన్నై vs రాజస్థాన్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో నేడు రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Update: 2025-05-20 02:48 GMT

ఐపీఎల్ తుది దశకు చేరుకున్న సమయంలో కొన్ని మ్యాచ్ లు జరుగుతున్నప్పటికీ పెద్దగా జోష్ నింపడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి అవి నిష్క్రమించడంతో ఆ జట్టు అభిమానుల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ వరకూ ఈ మ్యాచ్ లను చూసేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు. ఇప్పటికే మూడు జట్లుప్లే ఆఫ్ రేసుకు చేరుకోవడంతో దాదాపు ఐదు జట్లు ఇంటి దారి పట్టాయి. వాటిలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలిగాయి.

ఎవరు గెలచినా...
ఈరోజు ఐపీఎల్ లో నామమాత్రపు మ్యాచ్ జరుగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో నేడు రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినవి కావడంతో పెద్దగా ఆసక్తి లేని మ్యాచ్ ఇది. కానీ ధోని ఉండటంతో కొంత అభిమానులు చూసే అవకాశముంది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు రెండు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థాయిలో ఉండటంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా నామమాత్రమే అవుతుంది.


Tags:    

Similar News