IPL 2025 : ఆల్ రౌండ్ పెరఫార్మెన్స్ తో అదరగొట్టిన పంజాబ్.. ఓడిన రాజస్థాన్

జైపూర్ లో జరిగిన రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయాన్ని అందుకుంది

Update: 2025-05-19 01:53 GMT

ఐపీఎల్ మ్యాచ్ లు తిరిగి ప్రారంభమయిన వెంటనే పంజాబ్ కింగ్స్ అదిరిపోయే ఆరంభంతో విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్ తొలి నుంచి జీ ఐపీఎల్ సీజన్ లో మంచి పెర్ ఫెర్మాన్మెన్స్ చూపిస్తుంది. పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇక ఈ సీజన్ లో తొలి నుంచి తడబడుతూ అడుగులు వేస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఎప్పటిలాగానే అపజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి రాజస్థాన్ రాయల్స్ నిష్క్రమించడం అందరికీ తెలిసిందే. నిన్న జైపూర్ లో జరిగిన రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయాన్ని అందుకుంది. పది పరుగుల తేడాతో విజయాన్ని సాధించి ప్లేఆఫ్ లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

ఆల్ రౌండ్ ప్రతిభతో...
పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో ఆల్ రౌండ్ పెర్ ఫార్మెన్స్ చేస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ తో తన సత్తాను చాటుతూ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టులో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 9 పరుగులకే అవుటయి నిరాశపర్చినా, ఈ సీజన్ మొత్తంలో మంచి ప్రదర్శన చేసిన ప్రభ సిమ్రన్ కూడా21 పరుగులకే వెనుదిరిగాడు.ఒక ఒవెన్ డకౌట్ కకాగా, వధేరా 70 పరుగులతో రాణించాడు. శ్రేయస్ అయ్యర్ 30 పరుగులు చేసి అవుటయినా శశాంక్ నాటౌట్ గా నిలిచి 59 పరుగులు చేశాడు. అజ్మతుల్లా చివర్లో మంచి బాదుడు బాది 21 పరుగులు చేయడంతో పంజాబ్ కింగ్స్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేయగలిగింది.
పెద్ద లక్ష్యమే అయినా...
రాజస్థాన్ రాయల్స్ కు పెద్ద లక్ష్యమే అయినా కనీసం ఈ మ్యాచ్ లో అయినా రాణిస్తుందని ఆ జట్టు ఫ్యాన్స్ భావించారు. కానీ అందరి ఆశలను అడియాసలను చేసేసింది. యశస్వి జైశ్వాల్ యాభై పరుగులు చేసి పరవాలేదనిపించినా, వైభవ్ సూర్యవంశీ నలభై పరుగులు చేసి ఫామ్ లో ఉన్నానని చెప్పినా, శశాంసన్ ఇరవై పరుగులు, పరాగ్ పదమూడు పరుగులు చేసి అవుటయినా జురెల్ మాత్రం యాభై పరుగుల చేసి నిలబడ్డాడని భావించేలోపు అవటుయ్యాడు. దీంతో ఇక హెట్ మెయర్ పదకొండు పరుగులు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఓటమి పాలయింది. పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ లోకి అడుగు పెట్టింది.
Tags:    

Similar News