IPL 2025 : నేడు ఐపీఎల్ లో డబుల్ ధమాకా
నేడు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ కింగ్స్ జట్టు ఢీకొంటుంది. ఢిల్లీ కాపిటల్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది
ఐపీఎల్ 18 సీజన్ తిరిగి ప్రారంభమయింది. నిలిచిపోయిన ఆటలు మళ్లీ మొదలయ్యాయి. మొత్తం పదిహేడు మ్యాచ్ లు మిగిలిపోయి ఉన్నాయి. జూన్ 3వ తేదీన ఫైనల్స్ జరుగుతుంది. అయితే తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే నేడు ఆదివారం కావడంతో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈరోజు మధ్యాహ్యం 3.30 గంటలకు రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ కింగ్స్ జట్టు ఢీకొంటుంది. జైపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఇరుజట్లకు...
రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ కాపిటల్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ రేసుకు దగ్గరగా ఉంది. పదిహేను పాయింట్లతో అది మూడో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఆరు పాయింట్లతోనే అది చివరి స్థానంలో నిలిచి ఉంది. ఇక రాత్రి జరిగే మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కూడా మంచి పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అదే ఢిల్లీ కాపిటల్స్ కూడా పదమూడు పాయింట్లతో ప్లేఆఫ్ రేసుకు దగ్గరగా ఉంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం అని చెప్పాలి.