IPL 2025 : ప్లే ఆఫ్ రేసులోకి దూసుకెళ్లిన పంజాబ్ .. లక్నో కు మళ్లీ పరాజయమే
ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది.
ఐపీఎల్ సీజన్ 18లో ఇక ప్లే ఆఫ్ రేస్ ప్రారంభమయింది.ఈ రేసులో కొన్ని జట్లు వెనకబడుతుండగా మరికొన్నిజట్లు మాత్రం పుంజుకుని ప్లేఆఫ్ రేసులోకి తదూసుకొస్తున్నాయి. వాటిలో పంజాబ్ కింగ్స్ ఒకటి. పంజాబ్ కింగ్స్ తొలి నుంచి అన్ని మ్యాచ్ లలో నిలకడగా రాణిస్తూ పాయింట్లు సాధిస్తూ ప్లే ఆఫ్ రేసులో కొనసాగడానికి అవకాశాలను మరింత సులభతరం చేసుకుంది. ఇప్పటి వరకూ పంజాబ్ కింగ్స్ పదకొండు మ్యాచ్ లు ఆడి ఏడు మ్యాచ్ లలో విజయం సాధించింది. నాలుగింటిలో మాత్రమే ఓడిపోయింది. అదే లక్నో సూపర్ జెయింట్స్ కు లక్కు కలసి రావడం లేదు. పదకొండు మ్యాచ్ లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ కేవలం ఐదు మ్యాచ్ లు ఆడి పది పాయింట్లతో సరిపెట్టుకుని ప్లే ఆఫ్ లోకి రావడానికి క్లిష్టతరం చేసుకుంది. నిన్న ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది.