బాల్ పై పంత్ కంప్లైంట్.. పట్టించుకుంటారా?

ఇంగ్లాండ్-ఇండియా టెస్టు సిరీస్‌లో వాడుతున్న బంతుల నాణ్యతపై భారత జట్టు వైస్‌కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Update: 2025-07-10 11:00 GMT

ఇంగ్లాండ్-ఇండియా టెస్టు సిరీస్‌లో వాడుతున్న బంతుల నాణ్యతపై భారత జట్టు వైస్‌కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంతి నాణ్యతను ప్రశ్నించాడు. బంతి ఇంత త్వరగా రూపు మారడాన్ని తాను ఇప్పటి వరకూ చూడలేదని పంత్ ఆరోపించాడు. డ్యూక్స్‌ బంతి కొన్ని ఓవర్లకే మృదువుగా మారుతోందని, ఆ తర్వాత మళ్లీ కొత్త బంతి తీసుకునేవరకు బౌలర్లకు కష్టమవుతోందని చెప్పాడు పంత్. బ్యాటర్లు కూడా బంతి స్వభావానికి తగ్గట్టుగా ఆటను మార్చుకోవాల్సి వస్తోందని చెప్పాడు. సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఆటగాళ్లు బంతి మార్చాలని చాలాసార్లు అంపైర్లను సంప్రదించారు. అయితే అంపైర్లు పెద్దగా ఆటగాళ్ల ఫిర్యాదులను పట్టించుకోలేదు.

Tags:    

Similar News