Asia Cup :పాక్ క్రికెట్ బోర్డు మరోసారి ఐసీసీకి లేఖ
ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని చెప్పిన బెదిరింపును వెనక్కి తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్‌ను తప్పించాలనే పాకిస్తాన్ క్రిడిమాండ్ మాత్రం కొనసాగుతోంది.
ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని చెప్పిన బెదిరింపును వెనక్కి తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్‌ను తప్పించాలనే పాకిస్తాన్ క్రిడిమాండ్ మాత్రం కొనసాగుతోంది. జింబాబ్వేకు చెందిన పైక్రాఫ్ట్ స్థానంలో రిచీ రిచర్డ్సన్‌ను నియమించాలని పీసీబీ మంగళవారం రాత్రి ఐసీసీకి మరోసారి లేఖ పంపింది. కానీ ఇప్పటివరకు ఐసీసీ దీనిపై స్పందించలేదు.
రిఫరీని తప్పించాలని మాత్రం...
పైక్రాఫ్ట్ పాకిస్తాన్ యూఏఈతో ఆడబోయే ఈరోజు ఆటకు రిఫరీగా ఉన్నారు. ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ఇండియా ఆటగాళ్లు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో సహా, పాక్ ఆటగాళ్లకు చేతులు కలపకుండా వెళ్లిపోవడంతో వివాదం మొదలైంది. దీనికి నిరసనగా పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పాల్గొనలేదు. ఈ వ్యవహారానికి పైక్రాఫ్ట్ కారణమని పీసీబీ ఆరోపించింది. సల్మాన్‌కి సూర్యకుమార్‌తో చేతులు కలపవద్దని పైక్రాఫ్ట్ సూచించాడని, అలాగే రెండు జట్ల కెప్టెన్లు సాధారణంగా చేసుకునే జట్టు జాబితాల మార్పిడి కూడా జరగనివ్వలేదని పీసీబీ అభ్యంతరం తెలిపింది.