పాకిస్థాన్ నిలిచింది
ఆసియా కప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అద్భుత విజయాన్ని అందుకుంది
ఆసియా కప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అద్భుత విజయాన్ని అందుకుంది. సూపర్-4 పోరులో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఒక దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన పాకిస్థాన్‌ను నవాజ్, తలత్ హుస్సేన్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో పాకిస్థాన్ టోర్నీలో తమ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. కమిందు మెండిస్ అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేశాడు. అతడికి సహకారం పెద్దగా అందకపోవడంతో ఓ మోస్తరు స్కోరు చేసింది లంక.