India Vs South Africa : వన్డే సిరీస్ ను అయినా కొట్టండి బాసూ
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నెల 30వ తేదీన రాంచీ వేదికగా తొలి వన్డే జరగనుంది
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నెల 30వ తేదీన రాంచీ వేదికగా తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే భారత్ దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ సొంత గడ్డపై కోల్పోయింది. వైట్ వాష్ కు గురయింది. కోల్ కత్తలో జరిగి. తొలి టెస్ట్ ఓటమి పరవాలేదని పించింది. కేవలం ముప్ఫయి పరుగుల తేడాతోనే ఓటమి పాలయింది. కానీ గౌహతిలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో మాత్రం ఘోర పరాభవాన్ని చవి చూసింది. 400కు పైగానే పరుగుల తేడాతో ఓటమి పాలు కావడంతో భారత్ అభిమానుల నుంచి టీం ఇండియా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది.
పటిష్టమైన జట్టుగానే...
అయితే టెస్ట్ సిరీస్ ను సమర్పించినట్లే .. వన్డే సిరీస్ ను కూడా సమర్పించుకుంటారా? అన్న అనుమానం ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన కలిగిస్తుంది. టెస్ట్ సిరీస్ పై గెలిచిన కసితో దక్షిణాఫ్రికా ఉంది. రెట్టించిన ఉత్సాహంతో దక్షిణాఫ్రికాలో రాంచీ మైదానంలో అడుగు పెడుతుంది. కానీ ఘోర ఓటమిని చవి చూసిన భారత్ నైరాశ్యంతోనే కదులుతున్నట్లుంది. కానీ వన్డే సిరీస్ అయినా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలన్న భావనతో టీం ఇండియా ఉంది. ఎందుకంటే వన్డేలో పటిష్టమైన జట్టుగా భారత్ ఇప్పటికే అనేకసార్లు ప్రపంచ వేదికలపై నిరూపించుకుంది.
గణాంకాలు మాత్రం...
అందులోనూ సొంత మైదానంలో ఆడుతుండటంతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను తాము వైట్ వాష్ చేసి ప్రతీకారం తీర్చుకోవాలని టీం ఇండియా రగిలిపోతుంది. గణాంకాలు చూస్తే దక్షిణాఫ్రికా కే వన్డే మ్యాచ్ లలో భారత్ పై ఎక్కువ విజయాలున్నాయి. మొత్తం రెండు జట్ల మధ్య 94 మ్యాచ్ లు జరిగితే దక్షిణాఫ్రికా 51 మ్యాచ్ లలో విజయం సాధించగా, భారత్ 41 మ్యాచ్ లలో విక్టరీ కొట్టింది. మూడు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. ఈ నెల 30న రాంచీలో తొలి వన్డే, డిసెంబరు 3న రాయపూర్ లో రెండో వన్డే, డిసెంబరు 6న విశాఖపట్నంలో మూడో వన్డే జరగనుంది. వన్డే మ్యాచ్ లకు కెఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ధ్రువ్ జురెల్ లు ఉన్నారు.