రిటైర్‌మెంట్ తీసుకోలేదు: షకీబ్

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకున్నాడు.

Update: 2025-12-08 16:06 GMT

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకున్నాడు. గతేడాది టెస్ట్, టీ20 క్రికెట్‌కు అతడు వీడ్కోలు చెప్పాడు. అయితే మూడు ఫార్మాట్లలోనూ జాతీయ జట్టుకు ఆడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. అధికారికంగా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ కాలేదని, బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి వన్డే, టెస్ట్, టీ20 పూర్తి సిరీస్ ఆడి, రిటైర్ కావడమే తన ప్రణాళిక అని తెలిపాడు. బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. మే 2024 నుంచి షకీబ్ అల్ హసన్ ఆ దేశానికి తిరిగి వెళ్లలేదు. ఆ పార్టీ మాజీ ఎంపీ అయిన అతడిపై హత్య కేసులో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయింది.

Tags:    

Similar News