ఇకపై బంతులను లెక్కెట్టి.. పవర్ ప్లే
వర్షం కారణంగా టి20 మ్యాచ్‌ను కుదించాల్సి వస్తుంది.
వర్షం కారణంగా టి20 మ్యాచ్‌ను కుదించాల్సి వస్తుంది.ఇలాంటి సమయంలో ఎన్ని ఓవర్లు పవర్‌ప్లే ఉండాలనే విషయంపై చిన్న కన్ఫ్యూజన్ అనేది నిర్వాహకుల్లో ఉంటుంది. సాధారణంగా ఒక టి20 ఇన్నింగ్స్‌లో పవర్‌ప్లే 6 ఓవర్లు కాగా, ఇన్నింగ్స్‌లో ఓవర్ల సంఖ్య తగ్గగానే దాని ప్రకారం లెక్కగట్టి పవర్‌ప్లే ఓవర్ల సంఖ్యను నిర్ణయించేవారు. ఇకపై టి20 పవర్‌ప్లే విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక మార్పు చేసింది. జూలై నుంచి అమల్లోకి వస్తుంది. కచ్చితత్వం కోసం ఓవర్లు కాకుండా బంతులను పవర్‌ప్లే కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఇకపై 8 బంతుల పవర్ ప్లే, 19 బంతుల పవర్ ప్లే ను చూడబోతున్నామానుకోండి.