నారా దేవాన్ష్ కు అరుదైన రివార్డు
నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ అరుదైన రివార్డు అందుకున్నాడు. ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు
నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ అరుదైన రివార్డు అందుకున్నాడు. ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. వేగవంతమైన చెక్ మేట్ సాల్వర్ 175 పజిల్స్ సాధించి అరుదైన ఘనతను సాధించారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ హాల్ లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుల వేడుకలో దేవాన్ష్ కు నిర్వాహకులు ఈ అవార్డును అందచేశారు.
తండ్రి, తాత అభినందనలు...
గత ఏడాది చెక్ మేట్ 175 సవాళ్లను పరిష్కరించి దేవాన్ష్ ప్రపంచ రికార్డు సాధించారు. చెస్ డొమైన్ లోనూ మరో రికార్డులను సాధించారు. దీంతో దేవాన్ష్ సాధించిన ఈ ఘనత గర్వకారణమని నారాలోకేశ్ పఅన్నారు. పదేళ్ల వయసులోనే ఆలోచనలకు పదును పెడుతూ అంకిత భావంతో దేవాన్ష్ చెస్ నేర్చుకున్నాడని నారా లోకేశ్ తెలిపారు. తన మనవడు సాధించిన ఘనతను తాతా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అభినందనలు తెలియ చేశారు. మా ఛాంపియన్ కు శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు.