IPL 2025 : నేడు ఐపీఎల్ పంజాబ్ vs ముంబయి

నేడు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తో ముంబయి ఇండియన్స్ ఢీకొంటుంది. జైపూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Update: 2025-05-26 03:06 GMT

ఐపీఎల్ లో నేటి నుంచి ప్లే ఆఫ్ రేసు ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ లు ఒక ఎత్తు. ఇకపై జరగబోయే మ్యాచ్ లు మరొక ఎత్తు. ఎందుకంటే ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ లు పెద్దగా పరిగణనలోకి తీసుకోకపోయినప్పటికీ ఛాంపియన్ షిప్ ను అందుకోవడానికి అడుగు దూరంలో నిలవాల్సిన సమయం వచ్చేసింది. అందుకే నేటి నుంచి ప్రారంభమయ్యే ప్రతి మ్యాచ్ ఇక క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. అంతేకాదు ఈ మ్యాచ్ లలో గెలిచి ఛాంపియన్ షిప్ ను అందుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

నేడు కీలక మ్యాచ్...
నేడు ఐపీఎల్ లో ప్లే ఆఫ్ రేసులో ఉన్న రెండు కీలక జట్లు తలపడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ తో ముంబయి ఇండియన్స్ ఢీకొంటుంది. జైపూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో మంచి ఊపుమీదుంది. పదమూడు మ్యాచ్ లు ఆడి పదిహేడు పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ముంబయి ఇండియన్స్ పదమూడు మ్యాచ్ లు ఆడి పదహారు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు టాప్ 2లో స్థానం ఖరారవుతుంది. అందుకే ఈ మ్యాచ్ కీలకం.


Tags:    

Similar News