ప్లే ఆఫ్స్ కు చేరిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.
ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 13 మ్యాచ్‌ల్లో ఎనిమిదో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్-4లో చోటు దక్కించుకుంది. ఇప్పటికే గుజరాత్, బెంగళూరు, పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
ఇక లీగ్ స్టేజ్‌లో ఢిల్లీ తన చివరి మ్యాచ్‌ను పంజాబ్‌తో మే 24న ఆడనుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 73 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నమన్ ధీర్ 8 బంతుల్లో 24 పరుగులు చేసి ముంబై మంచి స్కోరు చేయడానికి దోహద పడ్డాడు. ఇక లక్ష్యఛేదనలో ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది.