IPL 2025 : ముంబయి ఖాతాలో మరో విజయం.. లక్నో కు వరసగా పరాజయం

ముంబయిలో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ మీద సులువుగా విజయం సాధించింది

Update: 2025-04-28 01:44 GMT

ఐపీఎల్ సీజన్ లో మంచి జట్లు అంటే అంచనాలు ఉన్న జట్లు ప్లేఆఫ్ వైపునకు దూసుకు వచ్చేటట్లే కనిపిస్తుంది. ముంబయి ఇండియన్స్ ఈ సీజన్ లో తొలిదశలో పరాజయాలతో ప్రయాణం ప్రారంభించి ఇప్పుడు వరస విజయాలను అందుకుంటూ రేసులో దూసుకు వస్తుంది. ముంబయి ఇండియన్స్ ఆట తీరునుతొలిసారి చూసిన వారికి ఈసారి కూడా ప్లేఆఫ్ కు కూడా రాదనిపించేలా ఉంది. రోహిత్ శర్మ ఫామ్ లో లేకపోవడంతో పాటు ఆ జట్టులో అందరు ఆటగాళ్లు పెద్దగా పెర్ ఫార్మెన్స్ చూపించలేకపోవడంతో దానిపై అంచనాలు పెద్దగా లేవు. అయితే ఒక్కసారిగా ఆ జట్టులో ఎంత మార్పు? ఎందుకో తెలియదు కానీ? ఇపప్పుుడు జట్టులోని అందరూ ఫామ్ లోకి వచ్చారు. బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణిస్తున్నారు.

సులువైన విజయం...
నిన్న ముంబయిలో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ మీద సులువుగా విజయం సాధించింది. అదే ఫామ్ ను కొనసాగించింది. వరసగా ఐదో విజయాన్ని అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ పై రివెంజ్ తీర్చుకుంది. ముంబయి ఇండియన్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ పై యాభై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ జట్టులో రికిల్ టన్ 58 పరుగులు చేశాడు.రోహిత్ శర్మ అనవసర షాట్ కు ప్రయత్నించి పన్నెండు పరుగులకే అవుటయినా సూర్యకుమార్ యాదవ్ నిలబడి 54 పరుగులు సాధించాడు. ఇక తిలక్ వర్మ కూడా ఆరు పరుగులతో నిరాశపర్చినా, హార్ధిక్ పాండ్యా ఐదు పరుగులతో వెనుదిరిగినా నమన్ ధీర్ ఇరవై ఐదు పరుగుుల, బోష్ ఇరవై పరుగులు చేసిజట్టుకు మంచి స్కోరు అందించారు. ముంబయి ఇండియన్స్ జట్టు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేయగలిగింది.
భారీ స్కోరు లక్ష్యంతో...
215 పరుగులు స్కోరు అంటే అధికమే. ఈ స్కోరు సాధించాలంటే తొలి నుంచి దూకుడుగా ఆడాల్సి ఉంది. అదే లక్నో సూపర్ జెయింట్స్ కు లక్కు ముఖం చాటేసింది. మార్ష్ 34 పరుగులు చేసినా మార్ క్రమ్ తొమ్మిది పరుగులకే అవుటయ్యారు.పూర్ 27 పరుగులు చేసి సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. పంత్ ఎప్పటిలాగే నాలుగు పరుగులకే అవుటయ్యాడు. బదోని 35 పరుగులు, మిల్లర్ 24 పరుగులు చేసినా ముంబయి ఇండియన్స్ జట్టు పెట్టిన లక్ష్యాన్ని కనీసం చేరుకోలేకపోయారు. లక్నో సూపర్ జెంయిట్స్ ఇరవై ఓవర్లలో ఆల్ అవుట్ అయి కేవలం 161 పరుగుల మాత్రమే చేయగలిగింది. బుమ్రా నాలుగు వికెట్లు తీసి లక్నో పరాజయానికి కారణమయ్యాడు. జాక్స్ మరో రెండు వికెట్లు, హార్ధిక్ పాండ్యా, బోష్ చెరో వికెట్ తీసి విజయాన్ని జట్టుకు సొంతం చేయగలిగారు.


Tags:    

Similar News