IPL 2025: చెన్నై రాత మారలేదు.. ముంబయి దూసుకు వస్తుందిగా

వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మీద ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది.

Update: 2025-04-21 01:57 GMT

చెన్నై సూపర్ కింగ్స్ ఇక కోలుకోలేదు. ముంబయి దూసుకు వస్తుంది. నిన్న మొన్నటి వరకూ రెండు జట్ల ఆటతీరు ఒకేలా ఉండేది. అలాంటి వరస ఓటములతో చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగుకు చేరిపోగా, ముంబయి ఇండియన్స్ మాత్రం ప్లేఆఫ్ రేసులో తాము ఉన్నామంటూ వరసగా మూడు హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. ఐపీఎల్ లో ఇంకా చాలా ఆటలు మిగిలి ఉన్న సమయంలో ముంబయి పుంజుకోవడంతో దాని అభిమానుల్లో ఆశలు పెరిగాయి. వరస విజయాలు పలకరిస్తుండటంతో పాటు పాయింట్ల పట్టికలోనూ మంచి స్థానంలో దూసుకు వస్తుంది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఇప్పటి వరకూ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లో మెరుగుపడకపోవడంతో దాని ఫ్యాన్స్ మాత్రం డీలా పడ్డారు. నిన్న వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మీద ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది.

స్వల్ప పరుగులు చేసి...
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రషీడ్ 19, రచిన్ రవీంద్ర ఐదు, ఆయుష్ 32 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో పవర్ ప్లే లో మంచి స్కోరు సాధించాల్సిన చెన్నై ఓపెనర్లు వరసగా అవుట్ కావడంతో మిగిలిన వారిపై భారం పడింది. తర్వాత వచ్చిన జడేజా 52 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. శివమ్ దూబె కూడా నిలకడగా ఆడి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరూ అర్థ సెంచరీలు చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ కు కొంత గౌరవ ప్రదమైన స్కోరు లభించింది. లేకుంటే అదీ లేదు. ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో దీపక్ చాహర్, అశ్విని కుమార్ లు తలో వికెట్ తీయగా, బుమ్రా రెండు వికెట్లు తీశాడు.
ఒక వికెట్ కోల్పోయి...
176 పరుగులు అంటే పెద్ద స్కోరు కాదు. అందులో ముంబయి ఇండియన్స్ ముందు ఇది పెద్ద లక్ష్యమేమీ కాదు. అందుకే అంచనాలు ముందు నుంచే ముంబయి వైపు ఉన్నాయి. అందులోనూ సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండటంతో ముంబయి ఇండియన్స్ దే విజయం అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే ముంబయి ఇండియన్స్ లో బ్యాటర్లు రికిల్ టన్ 24, రోహిత్ 76, సూర్యకుమార్ 68 పరుగులు చేసి ముంబయిన గెలిపించగలిగారు. 15.4 ఓవర్లలోనే ముంబయి ఇండియన్స్ కేవలం ఒక వికెట్ కోల్పోయి 177 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడంతో ఇక స్టేడియంలో ఫ్యాన్స ఊగిపోయారు. మొత్తం మీద చెన్నై రాత మారకపోగా, ముంబయి ఇండియన్స్ మాత్రం చెలరేగిపోతుంది.








Tags:    

Similar News