అర్థరాత్రి బీచ్ రోడ్ లో మంత్రి నారాయణ

విశాఖ ఆర్కే బీచ్ రోడ్ లో అర్ధరాత్రి మంత్రి నారాయణ పర్యటించారు

Update: 2025-06-20 02:16 GMT

విశాఖ ఆర్కే బీచ్ రోడ్ లో అర్ధరాత్రి మంత్రి నారాయణ పర్యటించారు. రేపు యోగా డే వేడుకలు ఉండటంతో అర్ధరాత్రి సయితం నారాయణ యోగా ఏర్పాట్లను పరిశీలించారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే యోగా డే కార్యక్రమంలో అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. దాదాపు ఐదు లక్షలమంది విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలీ వరకూ యోగా వేడులకను నిర్వహించాలని నిర్ణయించారు.

యోగా జరిగే ప్రాంతంలో...
యోగాంధ్ర కార్యక్రమం జరిగే 26 కిలోమీటర్ల బీచ్ రోడ్ లో ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. పార్కింగ్ ప్రాంతాలు,డ్రింకింగ్ వాటర్ ,టాయిలెట్లు పరిశీలించిన మంత్రి నారాయణ అధికారులకు పలు సూచనలు చేశారు. జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సుమారు రెండు గంటలపాటు పర్యటించిన మంత్రి నారాయణ రేపటి ఏర్పాట్లపై సమీక్షించారు


Tags:    

Similar News