Asia Cup : ఆసియా కప్ లో నేడు సూపర్ పోరు
ఆసియా కప్ లో నేడు హోరా హోరీ సమరం జరగనుంది. భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది దుబాయ్ వేదికగా మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది
ఆసియా కప్ లో నేడు హోరా హోరీ సమరం జరగనుంది. భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది దుబాయ్ వేదికగా మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకూ సాగిన మ్యాచ్ లన్నీ ఏకపక్షంగా సాగినవే. నేడు మాత్రం దాయాదుల సమరం జరుగుతుండటంతో పాటు ఆదివారం కూడా కావడంతో ఎక్కువ మంది క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ ను ఉత్కంఠగా చూసేందుకు వేచి ఉన్నారు.
ఉగ్రదాడి తర్వాత...
పహాల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో రెండు దేశాల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే రెండు జట్లు పసికూన ఒమన్ ను చిత్తు చేశాయి. ప్రపంచ కప్ లలోనూ, టీ 20లలోనూ భారత్ దే ఆధిపత్యం. అయితే పాక్ కూడా ఈ మ్యాచ్ లో నెగ్గి తమ దేశంలో అభిమానులే కాదు. ప్రజల నుంచి మద్దతును పొందేలా టీం కసరత్తు చేయనుంది. మొత్తం మీద మరికొద్ది గంటల్లో అసలైన సమరం ప్రారంభం కానుంది.