టాస్ గెలిచిన న్యూజిలాండ్

భారత్ - న్యూజిలాండ్ ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

Update: 2023-01-29 13:17 GMT

భారత్ - న్యూజిలాండ్ ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో తరహా మాదిరిగానే న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. డెత్ ఓవర్లలో భారత్ బౌలర్లు ఏ మేరకు పరుగులను కట్టడి చేస్తారో అన్నది చూడాల్సి ఉంది. తొలి టీ 20 మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 176 పరుగులు చేసింది.

పరుగులను కట్టడి చేస్తేనే....
అనంతరం బరిలోకి దిగిన భారత్ బ్యాటింగ్ 155 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. భారత్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఇషాన్ కిషన్, శుభమన్ గిల్ తో పాటు అందరూ విఫలమయ్యారు. ఒక్క సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లు మాత్రమే సఫలమయ్యారు. ఈరోజు మాత్రం బ్యాటర్లు ఒక పట్టు పట్టాల్సి ఉంటుంది. లేకుంటే సిరీస్ న్యూజిలాండ్ పరమవుతుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ను తక్కువ పరుగులకే భారత్ కట్టడి చేయగలిగితేనే విజయం సొంతమవుతుంది.


Tags:    

Similar News