Asia Cup : భారత్ - బంగ్లాదేశ్ .. టాస్ గెలిచిన బంగ్లా.. ఫస్ట్ బ్యాటింగ్ భారత్
ఆసియా కప్ లో భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య జరగనున్న మ్యాచ్ జరగనుంది. టాస్ గెలచిన బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది
ఆసియా కప్ లో భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య జరగనున్న మ్యాచ్ జరగనుంది. టాస్ గెలచిన బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీం ఇండియా జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం కావడంతో పాటు టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్లు ఫైనల్స్ కు వెళ్లే అవకాశాలున్నాయి. బంగ్లాదేశ్ స్వల్ప మార్పులతో బరిలోకి దిగనుంది. జట్టులో నాలుగు మార్పులు చేసింది.
మూడు సార్లు ఫైనల్ కు...
బంగ్లాదేశ్ ఇప్పటికే శ్రీలంక జట్టుపై విజయం సాధించి ఉత్సాహంతో ఉంది.బంగ్లాదేశ్ ను ఓడించి నేరుగా ఫైనల్స్ కు చేరుకునేందుకు టీం ఇండియా మార్గం సుగమం చేసుకునేందుకు కసితో ఉంది. బంగ్లాదేశ్ జట్టు కూడా బలంగా కనిపిస్తుంది. గతంలోనూ బంగ్లాదేశ్ ఆసియా కప్ లో మూడుసార్లు ఫైనల్స్ లో తలపడిని తీరు కొంత కలవరపరుస్తుంది. ఈ మ్యాచ్ మాత్రం ఉత్కంఠ భరితంగా సాగనుంది.