India Vs Pakisthan : హమ్మయ్య వికెట్ పడింది... పాక్ ఎన్ని రన్స్ కొట్టే ఛాన్స్ ఉందంటే?

భారత్ - పాకిస్థాన్ మధ్య మ్యాచ్ దూకుడుగా సాగడం లేదు

Update: 2025-02-23 11:48 GMT

భారత్ - పాకిస్థాన్ మధ్య మ్యాచ్ దూకుడుగా సాగడం లేదు. ది. తొలుత రెండు వికెట్లు పడ్డాయని సంతోషించినా తర్వాత ఒక్క వికెట్ కూడా పడకుండా ఆడుతున్నారు. రిజ్వాన్, షకీల్ కలసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బౌలర్లను మార్చిమార్చి చూసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు అక్షర్ పటేల్ రిజ్వాన్ ను అవుట్ చేయడంతో వారి భాగస్వామ్యానికి తెరపడింది.

క్యాచ్ లు మిస్...
అయితే రెండు క్యాచ్ లను ఇప్పటి వరకూ భారత్ మిస్ చేసింది. హర్షిత్ రాణా ఒకటి, కులదీప్ యాదవ్ మరొక క్యాచ్ మిస్ చేయడంతో షకీల్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం 35 ఓవర్లకు గాను 159 పాకిస్థాన్ పరుగులు చేసింది. అంచనాల ప్రకారం పాకిస్థాన్ యాభై ఓవర్లకు 280 పరుగులు చేసే అవకాశముందని చెబుతన్నారు. అంటే దుబాయ్ పిచ్ మీద భారీ స్కోరు అవుతుంది. ఈలోగా వికెట్లు పడితే కొంత వత్తిడి పెరిగి స్కోరు తగ్గే అవకాశముంది. హార్ధిక్ పాండ్యా షకీల్ ను అవుట్ చేయడంతో 159 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది.


Tags:    

Similar News