మణిపూర్ నుండి పారిపోయి.. హైదరాబాద్ కు వచ్చింది

ఇటీవలి కాలంలో మెయిటీ- కుకీ కమ్యూనిటీల మధ్య గొడవలు హింసాత్మకంగా మారిపోయాయి. అక్కడి హింస కారణంగా అథ్లెట్లు

Update: 2023-08-08 11:37 GMT

భారత దేశంలోనే క్రీడా ప్రతిభకు బంగారు గనిగా మణిపూర్ నిలిచింది. ఇటీవలి కాలంలో మెయిటీ- కుకీ కమ్యూనిటీల మధ్య గొడవలు హింసాత్మకంగా మారిపోయాయి. అక్కడి హింస కారణంగా అథ్లెట్లు రాష్ట్రాన్ని విడిచిపెట్టారు. చాలా మంది తమ ఇల్లు, ఆస్తులను కోల్పోయారు. అక్కడ జరుగుతున్న గొడవల కొంతకాలంగా క్రీడా కార్యకలాపాలు లేకుండా పోయాయి.

మణిపూర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ అయిన 10 ఏళ్ల కిమ్‌కిమ్ ఖోంగ్‌సాయి, ఆమె తల్లిదండ్రులతో కలిసి తన స్వగ్రామంలో జరిగిన హింసాత్మక ఘర్షణల నుండి అస్సాంలోని దిబ్రూఘర్‌కు పారిపోయింది. అక్కడ మేలో ఆమె బంధువుల ఇంట్లో తలదాచుకుని తమ ప్రాణాలను కాపాడుకున్నారు. అద్భుతమైన టాలెంట్ ఉన్న తమ కుమార్తె బ్యాడ్మింటన్ కెరీర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆమె తల్లిదండ్రులకు అర్థం కాలేదు. కుకీ సంఘంలో భాగమైన ఖోంగ్‌సాయి కుటుంబానికి హైదరాబాద్ లోని సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీ నుండి కాల్ వచ్చింది. షట్లర్ కిమ్‌కిమ్‌ను తమ అకాడమీలో చేర్చాలని ప్రతిపాదించారు.
కిమ్కిమ్‌పై ఫేస్‌బుక్‌లో వచ్చిన కథనాన్ని చూసి మణిపూర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌ను సంప్రదించి ఆమె తల్లిదండ్రుల కాంటాక్ట్ సంపాదించగలిగానని సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీ సహ వ్యవస్థాపకుడు, ప్రధాన కోచ్ ప్రదీప్ రాజు తెలిపారు. ఆమె బ్యాడ్మింటన్ ఆడుతున్న కొన్ని వీడియోలను నేను చూశాను. ఆమె చాలా మంచి ఫుట్‌వర్క్, స్ట్రోక్‌ప్లేతో మంచి ట్యాలెంట్ ఉన్న అమ్మాయి. మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో కిమ్కిమ్ తల్లి హోయిచాంగ్ ఖోంగ్‌సాయి పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, ఆమె తండ్రి జాంగ్‌ఖోలిమ్ ఖోంగ్‌సాయి సామాజిక కార్యకర్త. వీరిద్దరూ రాష్ట్రంలోని వెటరన్ విభాగంలో అనేక బ్యాడ్మింటన్ ఈవెంట్‌లలో పతక విజేతలుగా నిలిచారు. గత సంవత్సరం మణిపూర్ హిల్ డిస్ట్రిక్ట్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఛాంపియన్ అయిన కిమ్కిమ్, బ్యాడ్మింటన్ స్టార్‌గా ఎదుగుతూ వచ్చింది. ప్రతిరోజూ బ్యాడ్మింటన్ ఆటలో నిమగ్నమయ్యే తల్లిదండ్రుల కారణంగా ఆమె ఆరేళ్ల వయస్సులో బ్యాడ్మింటన్ రాకెట్‌ను ఎంచుకుంది. అప్పటి నుండే ఆడటం ప్రారంభించింది.


Tags:    

Similar News