ధోనీనే గెలిచాడు.. ఆ ఐపీఎస్ అధికారికి జైలు శిక్ష
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కోర్టు కేసులో
dhoni madras high court
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కోర్టు కేసులో గెలిచాడు. ధోని దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హై కోర్టు రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి జి సంపత్ కుమార్‌కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. అయితే తీర్పుపై అప్పీల్ చేయడానికి అధికారికి సమయం ఇస్తూ.. శిక్షను 30 రోజుల పాటు నిలిపివేసింది. మహేంద్ర సింగ్ ధోనీపై 10 సంవత్సరాల క్రితం బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన సదరు ఐపీఎస్ అధికారికి జైలు శిక్ష పడింది. ధోనీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసును ద్విసభ్య ధర్మాసనం విచారించింది. కేసు పూర్వాపరాలను నిశితంగా పరిశీలించిన జస్టిస్ ఎస్ ఎస్ సుందర్, జస్టిస్ సుందర్ మోహన్‌లు సంపత్ కుమార్‌కు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.