IPL 2025 : నేడు మరో అదిరే మ్యాచ్

ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది

Update: 2025-04-01 02:24 GMT

ఐపీఎల్ మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. కొన్ని మ్యాచ్ లు చివరి ఓవర్ వరకూ ఉత్కంఠతగా సాగుతుండగా, మరికొన్నిమ్యాచ్ ల లో వజియం ముందే ఖరారయిపోతుంది. అయితే ఇప్పటి రకూ జరిగిన పన్నెండు మ్యాచ్ లలో ఒకటి రెండు తప్పించి ఎక్కువ మ్యాచ్ లు ఉత్కంఠ భరితంగానే సాగాయి. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియం మోతెక్కిపోతుంది.

చెరొకటి గెలిచి...
ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి వరకూ రెండు మ్యాచ్ లు ఆడగా ఒక మ్యాచ్ లో గెలిచి మరొక మ్యాచ్ లో ఓటమి పాలయింది. పంజాబ్ కింగ్స్ మాత్రం ఒక మ్యాచ్ ఆడి అందులో గెలిచింది. దీంతో పంజాబ్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. లక్నో కూడా మరో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. ఈ మ్యాచ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందనే చెప్పాలి. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.


Tags:    

Similar News