IPL 2025 : నేడు ఐపీఎల్ లో డబుల్ ధమాకా
నేడు ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ కొంటుంది
ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ఆదివారం కావడంతో క్రికెట్ అభిమానులు తనివి తీరా చూసేలా ముందుగానే బీసీసీఐ ప్లాన్ చేసి ప్రతి శని, ఆదివారాలు రెండు మ్యాచ్ లను నిర్వహిస్తూ వస్తుంది. ఇక ఐపీఎల్ చివరి దశకు చేరుకుంటుండటంతో ప్లే ఆఫ్ కు ఏ జట్లు చేరతాయన్న దానిపై భారీగా బెట్టింగ్ లు కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తొలి నాలుగు స్థానాల కోసం పది జట్లు పోటీ పడటం సహజం. కానీ ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్టు ప్లే ఆఫ్ ఆశలను చంపేసింది.
నేడు కీలక మ్యాచ్ లు ఇవే...
ఈరోజు ఐపీఎల్ లో రెండు కీలక మ్యాచ్ లు జరగనున్నాయి. ముంబయి ఇండియన్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ నేడు ఢీకొంటుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ముంబయిలో జరగనుంది. ఇక మరో మ్యాచ్ ఢిల్లీ కాపిటల్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో ఢిల్లీ జట్టు ఎనిమిది మ్యాచ్ లు ఆడి ఆరింటిలో గెలిచి రెండో స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొమ్మిది మ్యాచ్ లు ఆడి ఆరింటిలో గెలిచి రెండింటిలో ఓడింది. ఢిల్లీని ఓడించాలన్న కసితో బెంగళూరు ఉంది. ఇక ముంబయి ఇండియన్స్ జట్టు తొమ్మిది మ్యాచ్ లు ఆడి ఐదు మ్యాచ్ లలో గెలిచి పన్నెండు పాయింట్లతో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా 9 మ్యాచ్ లు ఆడి ఐదు మ్యాచ్ లు ఆడి పది పాయింట్లతో ఉంది. రెండు జట్లు సమానంగా ఉండటంతో ఈ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగనుంది.