IPL 2025 : గుజరాత్ కు చెక్.. లక్నో దే విజయం అయినా?
అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను లక్నో సూపర్ జెయింట్స్ ఓడించింది
ఐపీఎల్ సీజన్ 18 లో గుజరాత్ టైటాన్స్ మంచి ఊపు మీద ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ లో తన సత్తా చాటుతూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆది నుంచి గుజారాత్ టైటాన్స్ అనేక విజయాలను అందుకుని, మేటి జట్లు అనుకున్న వాటిని కూడా ఓడించి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. గుజరాత్ టైటాన్స్ టైటిల్ కు చేరువలో ఉందన్న అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ షాక్ ఇచ్చినట్లయింది. నిన్న అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను లక్నో సూపర్ జెయింట్స్ ఓడించింది. అయితే ఈ ఫలితం ప్లే ఆఫ్ పై ఎలాంటి ప్రభావం చూపకపోయినప్పటికీ తాము గుజరాత్ ను ఓడించామన్న తృప్తి మాత్రం మిగుల్చుకోగలిగింది.
మార్ష్ సూపర్ సెంచరీ...
తొలుత బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ లో ఆరం భం నుంచి అదిరిపోయే పెర్ ఫార్మెన్స్ తో ముందుకు సాగింది. ఓపెనర్లిద్దరినీ అవుట్ చేయడానికి గుజరాత్ బౌలర్లను మార్చినా ఫలితం కనిపించ లేదు. మార్ క్రమ్ 36 పరుగుల చేసి అవుటయ్యాడు. మిచెల్ మార్ష్ 117 పరుగలు చేసి అత్యధిక పరుగుులు జట్టుకు జోడించాడు. పూరన్ కూడా అర్ధ సెంచరీ చేశాడు. యాభై ఆరు పరుగులు చేశాడు. పంత్ నాటౌట్ నిలిచి పదహారు పరుగులు చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ మొత్తం ఇరవై ఓవర్లకు గాను రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 235 పరుగులు చేసింది. మంచి ఫామ్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కు ఈ స్కోరు ఛేదించడంలో తడబడింది.
అత్యధిక పరుగుల లక్ష్యమే అయినా...
236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు ఆరంభం నుంచి శుభారంభం ఎదురు కాలేదు. సాయి సుదర్శన్ 21 పరుగుల వద్ద అవుటయ్యాడు. శుభమన్ గిల్ 35 పరుగులకు మాత్రమే పరిమితమయ్యాడు. బట్లర్ కూడా 33 పరుగులు చేసి వెనుదిరిగాడు. రూదర్ ఫర్డ్ 38 పరుగులు చేశాడు.షారూఖ్ ఖాన్ మాత్రమే యాభై ఏడు పరుగులు చేసి పరవాలేదనిపించాడు. తెవాతియా రెండు పరుగులు, అర్హద్ ఖాన్ ఒకటి, రషీద్ కాన్ నాలుగు, రబాడ రెండు చేయడంతో ఇరవై ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. 34 పరుగుల తేడా గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలయింది.