నితీశ్ ను తప్పిస్తూ!!
కోల్‌కతా వేదికగా నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో జరగబోయే తొలి టెస్ట్ నుండి ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని భారత జట్టు నుంచి విడుదల చేశారు.
కోల్‌కతా వేదికగా నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో జరగబోయే తొలి టెస్ట్ నుండి ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని భారత జట్టు నుంచి విడుదల చేశారు. నవంబర్ 13 నుంచి 19 మధ్యలో సౌతాఫ్రికా-ఏతో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొనాలని ఆదేశించారు. నవంబర్ 22 నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్ట్ సమయానికి తిరిగి సీనియర్ జట్టులో చేరనున్నాడు నితీశ్. నితీశ్ తాజాగా విండీస్‌తో జరిగిన సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో ఆడినా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సరైన అవకాశాలు రాలేదు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో ఇన్నింగ్స్‌లో నితీశ్‌కు బంతినే ఇవ్వలేదు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ అవకాశం రాగా మంచి ప్రదర్శన చేశాడు.