IPL 2025 : కోల్ కత్తా ను చావు దెబ్బ తీసిన పంజాబ్

న్యూ ఛండీగఢ్ లో జరిగిన పంజాబ్ కింగ్స్ పై జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి పాలయింది

Update: 2025-04-16 01:51 GMT

కోల్ కత్తా నైట్ రైడర్స్ కు సుడి లేదని మరోసారి అర్థమయింది. గత సీజన్ లోఛాంపియన్ గా నిలిచిన జట్టుకు ఈసారి సీజన్ అస్సలు కలసి రావడం లేదు. ఎంత దారుణంగా ఓటమి పాలవుతుందంటే.. ఎవరూ ఊహించనంతగా. నిన్న న్యూ ఛండీగఢ్ లో జరిగిన పంజాబ్ కింగ్స్ పై జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి పాలయింది. ఐపీఎల్ చరిత్రలో ఇది ఎన్నడూ జరగలేదేమో. ఛాంపియన్ గా నిలిచిన జట్టుకు ఇదేమి ఖర్మమో తెలియదు కానీ, జట్టు మొత్తం విఫలమవతూ అవతలి జట్టుకు విజయాన్ని అందిస్తుంది. ఇది ఒకరకంగా పంజాబ్ గెలుపు కాదు. నిజంగా కోల్ కత్తా నైట్ రైడర్స్ ఓటమి అని క్రికెట్ తెలిసిన వారు ఎవరైనా అంటారు.

తక్కువ స్కోరుకు...
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తన సొంత మైదానంలో అత్యధిక స్కోరు చేసేందుకు ముందు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటర్లు వరసగా విఫలం అయ్యారు. ఎవరూ క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయారు. ఒకదశలో ఇరవై ఓవర్లకు వంద పరుగులయినా చేస్తుందా? అన్న అనుమానాలు వచ్చిన తరుణంలో చివరకు 111 పరుగులు చేసింది. ఐపీఎల్ లో ఈ సీజన్ లో ఇది అతి తక్కువ స్కోరు అని చెప్పాలి. ఈ స్కోరు చూసిన వారికి ఎవరైనా కోల్ కత్తా నైట్ రైడర్స్ కు టార్గెట్ రీచ్ కావడం చాలా సులువు అనిపించక మానదు. పంజాబ్ కింగ్స్ మరో ఓటమి తప్పది అనుకున్నారు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 22, ప్రభ్ మన్ సింగ్ 30 పరుగులు చేసి పరావాలేదనిపించినా తర్వాత ఎవరూ పరుగులు చేయలేదు. దీంతో పంజాబ్ కింగ్స్ ఇరవై ఓవర్లకు గాను 15.3 ఓవర్లలోనేఆల్ అవుట్ అయి 111 పరుగులను చేసింది.
స్వల్ప లక్ష్యమే అయినా...?
తర్వాత ఇక స్వల్ప స్కోరును వికెట్ కోల్పోకుండా కోల్ కత్తా నైట్ రైడర్స్ ఈ టార్గెట్ ను ఛేదిస్తుందని అందరూ అనుకున్నారు. అందులోనూ కోల్ కత్తా నైట్ రైడర్స్ లో మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. డీకాక్ నుంచి రసెల్ వరకూ అందరూ మొనగాళ్లే. కానీ ఏం లాభం? ప్రతి వాళ్లు వరసగా అవుటవుతూ చిన్న లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయారు. డీకాక్ రెండు, నరైన్ ఐదు, రఘవంశీ 37 పరుగులు చేశారు. వెంకటేశ్ అయ్యర్ ఏడు, రింకూ సింగ్ పదిహేడు పరుగుుల, రమణదీప్ సింగ్ డకౌట్ అయ్యారు. కేవలం 15.1 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయి కేవలం 95 పరుగులు మాత్రమే చేయగలిగారు. రాహానే కూడా పదిహేడు పరుగులు చేసి అవుటయ్యాడు. కోల్ కత్తా నైట్ రైడర్స్ బౌలర్లలో యాన్సెన్ మూడు, చాహల్ నాలుగు వికెట్లు తీసికోల్ కత్తా నైట్ రైడర్స్ ను చావుదెబ్బ తీశారు. దీంతో పంజాబ్ కింగ్స్ దెబ్బకు కోల్ కత్తా నైట్ రైడర్స్ కథ ముగిసినట్లయింది.
Tags:    

Similar News