అనూహ్యం.. దక్షిణాఫ్రికా నుండి తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుండగా.. విరాట్ కోహ్లీ అనూహ్యంగా

Update: 2023-12-22 09:33 GMT

viratkohli

భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుండగా.. విరాట్ కోహ్లీ అనూహ్యంగా భారత్ తిరిగొచ్చాడు. కోహ్లీ కుటుంబపరమైన ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి వచ్చాడని, దక్షిణాఫ్రికాతో డిసెంబరు 26 నుంచి జరిగే తొలి టెస్టు నాటికి జట్టుతో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కోహ్లీ ఏ కారణాలతో భారత్ వచ్చాడన్నది బోర్డు వెల్లడించలేదు. ప్రస్తుతం ప్రిటోరియాలో జరుగుతున్న మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ గేమ్‌కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)లోని మూలాల ప్రకారం, రుతురాజ్ గైక్వాడ్ దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. యువ ఓపెనర్ వేలి గాయం నుండి కోలుకోలేదు. దీంతో అతడిని కూడా విడుదల చేసింది.

ఇటీవలే టెస్టు సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన కోహ్లి.. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. ఎమర్జెన్సీకి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు లేవు. అయితే డిసెంబర్ 26న సెంచూరియన్‌లో ప్రారంభమయ్యే మొదటి టెస్టు కోసం అతను జోహన్నెస్‌బర్గ్‌కు తిరిగి వస్తాడని BCCI వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రిటోరియాలో భారత ఆటగాళ్లు మూడు రోజుల ప్రాక్టీస్ గేమ్‌ ఆడనున్నారు. ఆ మ్యాచ్ కు దూరమయ్యే విషయమై టీమ్ మేనేజ్‌మెంట్, బీసీసీఐ అనుమతి పొందిన తర్వాత కోహ్లీ భారత్ కు వచ్చేశాడు.



Tags:    

Similar News