Jemima Rodrigues : జెమిమా రోడ్రిగ్స్.. ఈ పేరు వింటే చాలదూ.. ఇలాంటి అమ్మాయి మనఇంట్లో ఉండాలని ఎవరు కోరుకోరు?

జెమిమా రోడ్రిగ్స్ పేరు మహిళల వరల్డ్ కప్ తర్వాత ప్రపంచం అంతటా మారుమోగిపోతుంది.

Update: 2025-11-06 02:14 GMT

జెమిమా రోడ్రిగ్స్ వరల్డ్ కప్ తర్వాత ప్రపంచం అంతటా మారుమోగిపోతుంది. క్రికెట్ వరల్డ్ లో కొన్ని రోజులుగా హోరెత్తిపోతుంది. జెమిమా రోడ్రిగ్స్ మైదానంలో వేసే డ్యాన్స్ కు ఫిదా కాని వారుండరు. మహిళ క్రికెట్ ప్రపంచంలో ఉన్నంత వరకూ జెమిమా గుర్తుండిపోతుంది. ఏడు సార్లు వరుస ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాని ఒంటిచేత్తో ఓడించి... ఇండియా జట్టుని ఫైనల్స్ కు చేర్చిన ఘనత జెమిమా రోడ్రిగ్స్ కు ఖచ్చితంగా దక్కుతుంది. జెమిమా రోడ్రిగ్స్ ఆట వల్లనే భారత్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది.

అవకాశాలు ఊరికే...
జెమిమా రోడ్రిగ్స్ కు ఈ అవకాశం ఊరికే వచ్చి పడలేదు. ఆమె జీవితంలో చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు ఎదుర్కంది. వివక్షతకు గురయింది. జెమిమా రోడ్రిగ్స్ తండ్రిపై కేసులు నమోదయ్యాయి. జెమిమా రోడ్రిగ్స్ ను జట్టు నుంచి అనేక సార్లు తొలిగించారు. అయినా బ్యాటు వదలలేదు. మనో నిబ్బరాన్ని కోల్పోలేదు. తమ కుటుంబాన్ని విమర్శించిన వారికి మైదానంలోనే బ్యాటుతో సమాధానం చెప్పాలని జెమిమా రోడ్రిగ్స్ కఠిన నిర్ణయం తీసుకుంది. అదే ఆమె ఆట తీరును మార్చింది. భారత్ లో ఫైనల్స్ కు చేర్చి తన తండ్రికి భారీ బహుమతిని ఇచ్చింది.
డ్యాన్స్ అదరహో...
జెమిమా రోడ్రిగ్స్ మైదానంలో ఎంత హుషారుగా ఉంటుందో అందరికీ తెలుసు. మన ఇంట్లో అమ్మాయిలాగేనే వ్యవహరిస్తుంది. మనసులో కలిగే ఏ స్పందనను అణుచుకోలేదు. మైదానంలో ఆమె చేసే డ్యాన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాటలు కూడా పాడుతుంది. గిటార్ మీటుతుంది. సునీల్ గవాస్కర్ వంటి వారే భారత్ ఛాంపియన్ గా గెలిస్తే తాను జెమిమా రోడ్రిగ్స్ తో కలసి పాడతానని చెప్పడం ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలి. జెమిమా రోడ్రిగ్స్ కు ఉన్న టాలెంట్ మన ఇంట్లో ఉన్న అమ్మాయికి ఉండాలని ఏ భారతీయుడైనా కోరుకుంటాడు. ఆటకు.. మతానికి ముడిపెట్టకూడదు. టాలెంట్ కు.. ఆమె సెంటిమెంట్ కు ముడిపెట్టిన వారు నిజంగా బుద్ధి హీనులే.


Tags:    

Similar News