Asia Cup : ఈసారి ఆసియా కప్ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడేదెవరు?
ఆసియా కప్ విజేత ఎవరన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. అనేక మంది అనేక రకాలుగా జోస్యాలు చెబుతున్నారు.
ఆసియా కప్ విజేత ఎవరన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. అనేక మంది అనేక రకాలుగా జోస్యాలు చెబుతున్నారు. మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న భారత్ మరోసారి ఛాంపియన్ ట్రోఫీని ముద్దాడుతుందని చెప్పారు. ఏ కోణంలో చూసినా భారత్ బలంగా ఉందని అన్నారు. అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ కు ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్సీ ఇది సరికొత్త ఛాలెంజ్ అని చెప్పాలి. స్కై మైదానంలో భయపడడు. బంతికి వెరవడు. అలాగే టీం సభ్యులను ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇప్పటికే అనేక టీ20 సిరీస్ ను భారత్ సొంతం చేసుకుంది.
సూర్య కెప్టెన్సీలో...
ఆసియా కప్ లోనూ సూర్యకుమార్ యాదవ్ రప్పా రప్పా ఆడించడం ఖాయమని అంటున్నారు. టీ20 ఫార్మాట్ లోసూర్యకుమార్ యాదవ్ కు తిరుగులేదు. అంతే కాకుండా మంచి బలమైన జట్టు సూర్య వెనక ఉంది. భారత్ జట్టు బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ పరంగా రాటుదేలి ఉంది. ఐపీఎల్ లో అత్యధికంగా మ్యాచ్ లు ఆడిన అనుభవం ఆసియాకప్ లోనూ పనిచేస్తుందని నమ్ముతున్నారు. అందరూ ఐపీఎల్ లో సత్తా చూపిన వారే. తమ జట్టు గెలుపులో కీలక భూమిక పోషించిన వారే. అందుకే అలాంటి వారిని ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ లాంటి వారిని పక్కన పెట్టారన్న విమర్శలు తప్పించి మిగిలిన జట్టు చూస్తే అంతా చూసేందుకు బలంగా కనిపిస్తుంది.
బలమైన ప్రత్యర్థులుగా...
ఇక ఆసియా కప్ లో భారత్ కు బలమైన ప్రత్యర్థి పాకిస్థాన్ మాత్రమే. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లను కూడా తీసిపారేయలేం. ఈ పరిస్థితుల్లో ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. ప్రత్యర్థి జట్టు బలాలు, బలహీనతలను అంచనా వేసుకుని జట్టులో ఎప్పటికప్పుడు మార్పులు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో భారత్ జట్టు ఫేవరెట్ గా ఆసియా కప్ సమరంలోకి బరిలోకి దిగుతుంది. అయితే ఆట అంటే అన్నీ అనుకూలించాలి. సమయం కలసి రావాలి. దీంతో పాటు లక్ కూడా తోడవవ్వాలి. ఆటగాళ్ల శ్రమ కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు ఫీల్డింగ్ లోనూ చురుగ్గా వ్యవహరిస్తేనే మరొకసారి భారత్ ఛాంపియన్ ట్రోఫీని ముద్దాడుతుందన్న అభిప్రాయం ఎక్కువ మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.