ఐపీఎల్ రేసు ఇక ఆసక్తికరమే.. ఎవరు ముందుంటే?

ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది.

Update: 2025-05-25 14:50 GMT

IPL


ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ముంబయి ఇండియన్స్‌కు కూడా టాప్-2లోకి వచ్చేందుకు అవకాశాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ 18, పంజాబ్ 17, బెంగళూరు 17, ముంబయి 16 పాయింట్లతో ఉన్నాయి. గ్రూప్‌ స్టేజ్‌లో పంజాబ్ - ముంబయి మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ లో ముంబయి గెలిస్తే 18 పాయింట్లతో ముందుకు దూసుకుపోతుంది. అప్పుడు పంజాబ్ 17 పాయింట్లతోనే లీగ్‌ స్టేజ్‌ను ముగించాల్సి వస్తుంది.

చివరి మ్యాచ్ ను...

ఇక గుజరాత్ తన చివరి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. సీఎస్కే చేతిలో గుజరాత్ ఓడితే మాత్రం టాప్-2 స్థానాల్లో మార్పులు రావచ్చు. బెంగళూరు జట్టు కూడా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఇందులో ఆర్సీబీ గెలిచిందంటే తొలి రెండు స్థానాల్లో నిలుస్తుంది. గుజరాత్ చెన్నై చేతిలో ఓడి, ముంబయి జట్టు గెలిస్తే మాత్రం మంచి నెట్‌ రన్‌రేట్‌ కారణంగా ముంబై ఇండియన్స్ టాప్‌-2లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. మే 27న జరగనున్న లక్నోతో పోరు కూడా ఆర్సీబీకి అత్యంత కీలకం.

Tags:    

Similar News