IPL 2025 : కప్పు ఛాలెంజర్స్ దా? కింగ్స్ దా? పూనకాలు లోడింగ్

ఈరోజు ఐపీఎల్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్ జరుగుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. అహ్మదా వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Update: 2025-06-03 01:58 GMT

ఊపిరి బిగబట్టాల్సిందే.. చివర వరకూ టెన్షన్.. బాల్ బాల్ కు కేరింతలు.. సిక్సర్లు.. ఫోర్లతో స్టేడియం మోత మోగాల్సిందే. కేవలం స్టేడియంలో ఉన్న వారు మాత్రమే కాదు దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగా మ్యాచ్ చూస్తూ మునికాళ్లపై నిల్చోక తప్పదు. గుండెలు లబ్ డబ్ అని కొట్టుకుంటాయి. ఇరు జట్లకు దేశంలోనే కాదు అనేక దేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు.ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అత్యధికంగా అభిమానులున్నారు. అందుకు కారణం ఆ జట్టులో విరాట్ కోహ్లి ఉండటమే. కోహ్లి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే పంజాబ్ కింగ్స్ గెలవాలని కూడా లక్షలాది మంది అభిమానులు ఇప్పటికే కోరుకుంటున్నారు. అరుదైన, మ్యాచ్ కావడంతో పాటు క్వాలిఫయిర్ 1 లో బెంగళూరుది పై చేయి కావడంతో లెక్కలన్నీ ఛాలెంజర్స్ వైపు చూపుతున్నప్పటికీ పంజాబ్ కింగ్స్ గ్రౌండ్ లో పై చేయి సాధించే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే ఈ మ్యాచ్ ఫలితం కోసం లక్షల సంఖ్యలో అభిమానులు నిరీక్షిస్తున్నారు.

ఎవరు గెలిచినా?
ఐపీఎల్ 2025 నేటితో ముగియనుంది. ఈరోజు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్ జరుగుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. అహ్మదా వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గత సీజన్ కు భిన్నంగా ఈసారి ఛాంపియన్ షిప్ కొత్త వారికి దక్కనుంది. ఏ జట్టు గెలిచినా ఈసారి ఛాంపియన్ షిప్ కొత్త వారికి అందినట్లే. ఎందుకంటే ఇప్పటి వరకూ రెండు జట్ల కల సుదీర్ఘకాలంగా నెరవేరలేదు. ఫైనల్స్ కు చేరినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ షిప్ ను మిస్ చేసుకుంది. అందుకే రెండుజట్లు బలమైనవి కాబట్టే ఫైనల్స్ కు చేరుకున్నాయి. అయితే ఇది క్రికెట్ మైదానంలో ఆరోజు ఎవరిదో ఇప్పుడే ఎవరూ చెప్పలేని పరిస్థితి.
బలంగా ఉన్న బెంగళూరు...
చూస్తే బెంగళూరు జట్టు బలంగానే ఉంది. సీజన్ ఆరంభం నుంచి ఆ జట్టు మంచి విజయాలతో దూసుకు వచ్చింది. ఫైనల్స్ లోకి వచ్చిదంటే ఆల్ రౌండ్ ప్రతిభ కారణమని చెప్పక తప్పదు. ఐపీఎల్ ప్రారంభమయిన తొలి సీజన్లోనే మూడు సార్లు ప్లేఆఫ్ కు చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండుసార్లు ఛాంపియన్ షిప్ ను చేజార్చుకుంది. లక్కు కలసి రాకపోవడంతో పాటు గ్రౌండ్ లో ఆటగాళ్లు చేసిన తప్పులు టైటిల్ ను దూరం చేశాయని చెప్పాలి. అయితే ఈసారి బలంగా కనిపిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎలాగైనా కప్పు కొట్టాలన్న కసితో ఉంది. అయితే ఈసారి లక్కు ఎవరి వైపు చూస్తుందన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. బలమైన బ్యాటింగ్, పొదుపు గా చేసే బౌలింగ్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సమిష్టిగానే రాణిస్తుంది.
పటిష్ట దశలోపంజాబ్...
పంజాబ్ కింగ్స్ జట్టును కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. దాదాపు దశాబ్దకాలం తర్వాత పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంది. 2004లో ప్లేఆఫ్ కు చేరుకున్న పంజాబ్ కింగ్స్ చాలా రోజుల తర్వాత ఫైనల్స్ కు చేరింది. ఇప్పుడు ఆ జట్టు లక్ష్యం కప్పును సాధించడమే. మంచి బ్యాటింగ్ లైనప్ తో ఉన్న పంజాబ్ కింగ్స్ లో సరైన సమయంలో వికెట్లు తీయగల బౌలర్లు కూడా ఉన్నారు. ఛేదనలో ఎంత స్కోరు అయినా ఇటు పంజాబ్ కింగ్స్ అయినా, అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయినా తోపులని చెప్పాలి. అందుకే చివరి నిమిషం వరకూ విజయం ఎవరిదన్నది ఎవరూ అంచనా వేయలేకపోవచ్చు.అయితే ఈరోజు జరిగే మ్యాచ్ కు వాన గండం పొంచి ఉంది. అయితే రిజర్వ్ డే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చంటున్నారు. మొత్తం మీద నేడు క్రికెట్ ఫ్యాన్స్ చూసినోళ్లకు చూసినంత అని చెప్పాలి.


Tags:    

Similar News