India vs England First Test : అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నట్లుందిగా మనోళ్లు

ఇంగ్లండ్ - ఇండియా మధ్య లీడ్స్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ ఆటగాళ్లు రెండో రోజు ఉసూరుమనిపించారు

Update: 2025-06-22 02:25 GMT

ఇంగ్లండ్ - ఇండియా మధ్య లీడ్స్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ ఆటగాళ్లు రెండో రోజు ఉసూరుమనిపించారు. ముగ్గురు సెంచరీలు చేసినా తర్వాత వచ్చిన వాళ్లంతా కేవలం నలభై ఒక్క పరుగులకే ఆల్ అవుట్ కావడంతో కేవలం 471 పరుగులకు మాత్రమే ఇండియా పరిమితం కాగలింది. తొలి రోజు యజ్వేంద్ర జైశ్వాల్, శుభమన్ గిల్ లు సెంచరీలతో చెలరేగిపోతే కేఎల్ రాహుల్ కూడా పరవాలేదనట్లు ఆడాడు. అియతే రిషబ్ పంత్ కుదురుకోవడంతో స్కోరు బోర్డు పరుగులుతీసింది. నిన్ననే 350 స్కోరు దాటినా రెండో రోజు మాత్రం పంత్, గిల్ అవుటయిన తర్వాత వచ్చిన అందరూ ఆటగాళ్లు వరస బెట్టి పెవిలియన్ బాట పట్టారు. దీంతో భారత్ స్కోరు 471 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత్ బ్యాటర్లు...
అంది వచ్చిన అవకాశాన్ని భారత్ చేజార్చుకున్నట్లయింది. రెండో రోజు కూడా అదే దూకుడుగా ఆడితే స్కోరు ఖచ్చితంగా ఆరువందలు దాటేది. కానీ 471 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో ఇంగ్లండ్ సొంత గడ్డపైన ఊపిరి పీల్చుకునట్లయింది. రెండో రోజు రిషబ్ పంత్ 134 పరుగులు చేసి అవుట్ అయిన తర్వాత ఇంగ్లండ్ దే పై చేయిగా మారింది. శుభమన్ గిల్ 147 పరుగుల వద్ద వెనుదిరిగాడు. తర్వాత ఇగ్లండ్ పేసర్ జోష్ టంగ్ నాలుగు వికెట్లు తీసి భారత ఆటగాళ్లను దారుణంగా దెబ్బతీశాడు. తర్వాత తన ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టును ఆరంభంలోనే జస్పిత్ర బూమ్రా దెబ్బతశాడు. ఓపెనర్ జాక్ క్రాలీని తలి ఓవర్లోనే అవుట్ చేయగలిగాడు.
బూమ్రా అదరగొట్టినా...
బూమ్రా మొత్తం మూడు వికెట్లు తీయగలిగాడు. అయితే తర్వాత మాత్రం ఇక ఇంగ్లండ్ బ్యాటర్లు విజృంభించారు. క్రాలీ, డకెట్ లను అవుట్ చేశాడు. అయితే ఒలీ పోప్ సెంచరీతో మోత మోగించాడు. రకూట్ ఇరవై ఎనిమిది పరుగులకే అవుటయినా ఇంగ్లండ్ స్కోరు 49 ఓవర్లలో 209 పరుగులు చేయగలిగింది. బూమ్రా మొదలు పెట్టిన అవుట్లను కంటిన్యూ చేసి ఉన్నా, రెండో రోజు బ్యాటింగ్ లో భారత బ్యాటర్లు విజృంభిచి ఆడినా పరిస్థితి మరొలా ఉండేది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేయగలిగింది. ఇంగ్లండ్ 242 పరుగులు వెనకబడి ఉన్నప్పటికీ ఇంకా వికెట్లు ఉండటం కలిసొచ్చే అంశమే. మరి ఈరోజు అయినా భారత బౌలర్లు తమ చేతికి పని చెప్పగలిగితే తక్కువ పరుగులకే అవుట్ చేసి స్కోరుపై ఆధిపత్యం సాధించే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News