Indian vs Bangladesh Champions Trophy : ఆశలు పెరిగాయి.. తక్కువ రన్స్ కే పాక్ ఆల్ అవుట్

భారత్ - పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఫస్టాఫ్ ముగిసే సమయానికి భారత్ విజయావకాశాలు మెరుగుపడ్డాయి

Update: 2025-02-23 13:21 GMT

భారత్ - పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఫస్టాఫ్ ముగిసే సమయానికి భారత్ విజయావకాశాలు మెరుగుపడ్డాయి. 280 పరుగులు చేస్తారని భావించినా 241పరుగులకే పాకిస్థాన్ ను భారత్ బౌలర్లు ఆల్ అవుట్ చేయగలిగారు. భారత్ విజయలక్ష్యం 242 పరుగులుగా ఉంది. హార్ధిక్ పాండ్యాకు రెండు, కులదీప్ యాదవ్ కు మూడు, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాకు తలో వికెట్ తీయగలిగారు. రెండు రనౌట్లు చేయడంతో పాకిస్థాన్ తక్కువ స్కోరుకే భారత్ కట్టడి చేయగలిగింది. పాకిస్థాన్ బ్యాటర్లలో రిజ్వాన్, షకీల్ లు మాత్రమే రాణించగలిగారు. షకీల్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు.

బౌలర్లు ఓకే.. ఇక బ్యాటర్లపైనే...
తొలుత రెండు వికెట్లు పడినా రిజ్వాన్, షకీల్ పాతుకుపోవడంతో అతి పెద్ద స్కోరు చేస్తుందని అందరూ అంచానా వేశారు. కానీ వారిద్దరి భాగస్వామ్యం విడదీయడంతో కొంత తక్కువ స్కోరుకే ఆల్ అవుట్ చేయగలిగింది. అయితే ఇప్పుడు భారత్ బ్యాటర్లపైనే భారం ఉంది. యాభై ఓవర్లు ఉన్నాయి. రన్ రేట్ కూడా ఐదు కూడా లేదు. తక్కువ స్కోరుగానే కనపడుతున్నా పాక్ ఫాస్ట్ బౌలర్లు ముగ్గురున్నారు. వారి బౌలింగ్ ను ఎదుర్కొని తట్టుకుని నిలబడగలిగితే చాలు.. ఇండియా సులువుగా విజయం సాధించినట్లే.
వత్తిడి లేకుండా...
పాకిస్థాన్ కు ఇది డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి వత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే ఎటువంటి వత్తిడికి లోను కాకుండా కూల్ గా ఆడగలిగి నిలబడగలిగితే టార్గెట్ ను రీచ్ కావడం అంత కష్టమేమీ కాదు. నిలకడగానే ఆడుతూనే అప్పుడప్పుడూ ఫోర్లు బాదినా చాలు గెలుపు మన ముంగిట సులువుగా నిలుస్తుంది. ఓవర్ కు ఐదు పరుగులు కూడా లేకపోవడంతో మనకు గెలుపు అంత కష్టం కాదన్నది క్రీడా నిపుణుల అంచనాగా ఉంది. అయితే అనవరమైన షాట్లకు వెళ్లి ఓపెనర్ల నుంచి తర్వాత వారిపై వత్తిడి పడకుండా ఉండేలా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లు హిట్ అయితే చాలు ఇక ఈజీగా గెలుపు సాధించినట్లే.


Tags:    

Similar News