హార్థిక్ కోలుకుంటేనే ఆస్ట్రేలియా పర్యటనకు.. లేకుంటే అతని స్థానంలో....?

అక్టోబరు నెలలో ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ జట్లులో హార్ధిక్ పాండ్యా ఉండకపోవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి

Update: 2025-10-01 04:12 GMT

అక్టోబరు నెలలో ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ జట్లులో హార్ధిక్ పాండ్యా ఉండకపోవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. హార్ధిక్ పాండ్యా ఆల్ రౌండర్ గా బలంగా జట్టులో ఉండటం కొంత కలసి వచ్చే అంశం. కానీ ఆసియా కప్ లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా గాయపడిన హార్థిక్ పాండ్యా అప్పటికి ఇంకా కోలుకునే అవకాశం లేదని తెలిసింది. దీంతో ఆసియా కప్ ఫైనల్స్ లోనూ హార్థిక్ పాండ్యా పాల్గొనలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు మాత్రం హార్థిక్ పాండ్యా అందుబాటులో ఉండకపోవచ్చన్న వార్తలు అభిమానులను కలవర పర్చేవిధంగా ఉన్నాయి.

గాయం తీవ్రంగానేనని...
హార్థిక్ పాండ్యా ఎడమ క్వాడ్రిసెప్స్ గాయం, తొడ కండరాల గాయం నుంచి ఇంకా కోలుకోలేనట్లు చెబుతన్నారు. ఒకవేళ కొద్దిగా గాయం నుంచి ఉపశమనం లభించినా ఆస్ట్రేలియా పర్యటనకు మాత్రం అందుబాటులోకి రాకపోవచ్చని చెబుతున్నారు. హార్థిక్ పాండ్యా లేకపోతే ఆ భారం మొత్తం బుమ్రా మీద పడుతుంది. మరొక పేసర్ ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే హార్థిక్ పాండ్యా లాంటి ఆల్ రౌండర్ టీం ఇండియాకు దొరకకపోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. బుమ్రా కూడా ఎక్కువ ఓవర్లు బంతులు వేస్తే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతుంది.
ఈ నెల 19న ప్రారంభమై...
ఆస్ట్రేలియా పర్యటనకు టీం ఇండియా ఈ నెల 19వ తేదీన ప్రారంభమవుతుంది. నవంబర్ ఎనిమిది వరకూ కొనసాగుతుంది. హార్థిక్ పాండ్యా కోలుకోవడానికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశముందని కూడా అంటున్నారు. వన్డే మ్యాచ్ లకు దూరమయినా హార్థిక్ పాండ్యా టీ 20లకు అందుబాటులోకి వస్తారని కూడా అంటున్నారు. అంటే మధ్యలో హార్ధిక్ పాండ్యా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశముందని కూడా బీసీసీఐ వర్గాలు కొట్టిపారేయడం లేదు. మొత్తం మీద ఆస్ట్రేలియా పర్యటనలో భారం మొత్తం బుమ్రాపైనే పడనుంది. మరి హార్థిక్ పాండ్యా ఈలోపు కోలుకుంటే జట్టుతో బయలుదేరే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం అంటున్నారు.


Tags:    

Similar News